ప్రమాదపు అంచున పాఠశాల

7 Mar, 2019 19:58 IST|Sakshi
ఒండ్రు మట్టితో నిండిపోయిన పాఠశాల ముందు భాగం  

సాక్షి,బేతంచెర్ల : కర్నూలు జిల్లా బేతంచెర్ల పట్టణానికి సమీపాన ఉన్న అయ్యలచెర్వు ప్రాథమిక పాఠశాల పరిసరాలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ పాఠశాలలో సుమారు 158 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ముఖ్యంగా 15 సంవత్సరాల నుంచి పరిశ్రమల నుంచి వచ్చే నాపరాయి వేస్టేజీ, ఒండ్రు మట్టిని పాఠశాల వెనక భాగాన తరలించి, అక్కడే డంప్‌ చేయడంతో.. ఆ ప్రాంతం పెద్ద కొండలా కనిపిస్తోంది. ఎప్పుడైనా వర్షాలు ఎక్కువై నాపరాయి వేస్టేజీ కొండ కూలితే పాఠశాలపై పడే అవకాశం ఉంది. దానికితోడు, ఆ వేస్టేజీ రాళ్ల కింద ఉండే ఒండ్రుమట్టి పాఠశాల ఆవరణలోకి వచ్చి అసౌకర్యంగా దర్శనమిస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపి, నాపరాళ్లు, ఒండ్రుమట్టి వేస్టేజీని వేరే ప్రాంతానికి తరలించి, పాఠశాల ఆవరణాన్ని విద్యార్థులకు సౌకర్యంగా మార్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు