ఇది ‘బాబు’ భయోమెట్రిక్‌!

16 Nov, 2017 08:10 IST|Sakshi
యాదమరి ఉన్నత పాఠశాలలో విద్యార్థుల వివరాలు బయోమెట్రిక్‌లో నమోదు చేస్తున్న ఉపాధ్యాయులు

సీఎం సమీక్షిస్తారని హెడ్మాస్టర్లకు ఎస్‌ఎంఎస్‌లు

బయోమెట్రిక్‌లో టెన్త్‌ విద్యార్థుల అటెండెన్స్‌కు ఆపసోపాలు

సర్వర్‌ సమస్యతో నమోదు కాని వైనం

ప్రధానోపాధ్యాయులు మొదలుకుని జిల్లా అధికారులు బెంబేలు

‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పదవ తరగతి విద్యార్థుల బయోమెట్రిక్‌ హాజరుపై సమీక్షిస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మండల కేంద్రాల్లో ని హైస్కూళ్ల హెడ్మాస్టర్లు విధిగా టెన్త్‌ విద్యార్థుల హాజరును బయోమెట్రిక్‌లో తీసుకోవాలి’’– ఇదీ బుధవారం ఉదయం 10.30 గంటల కు జిల్లా విద్యాశాఖనుంచి హైస్కూ ళ్ల ప్రధానోపాధ్యాయులకు అందిన సంక్షిప్త సందేశం. అంతే! హెచ్‌ఎం లు బెంబేలెత్తారు. తరగతుల సంగ తి పక్కనబెట్టారు. టెన్త్‌ విద్యార్థుల హాజరును బయోమెట్రిక్‌లో తీసుకునేందుకు నానాపాట్లు పడ్డారు.

యాదమరి: ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థుల హాజరు నమోదుకు  బయోమెట్రిక్‌ మెషిన్లను ఇచ్చినప్పటికీ వివిధ కారణాలతో వాటిని అటకెక్కించారు. అప్ప ట్లో ఉపాధ్యాయులు విద్యార్థుల ఆధార్‌ కార్డు వివరాలతోపాటు నమోదు చేశా రు. సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడంతో ఇది పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. వారు కూడా దీనిమీద ఫోకస్‌ పెట్టకపోవడంతో ఆ న మోదు కార్యక్రమం అలాగే ఆగిపోయింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి,  టెన్త్‌ విద్యార్థుల బయోమెట్రిక్‌ అటెం డెన్స్‌ను సమీక్షిస్తారని, దీని వివరాలు వెంటనే ఇవ్వాలని ఆదేశాలు రావడంతో జిల్లాలోని హెడ్మాస్టర్లు కంగుతిన్నారు. సమాచారం అందింది మొదలుకుని టెన్త్‌ విద్యార్థుల బయోమెట్రిక్‌ హాజరు నమోదుకు ఆపసోపాలు పడ్డారు. నియోజకవర్గంలోని పూతలపట్టు, యాదమరి, తవణంపల్లె, ఐరాల, బంగారుపాళ్యం మండలాలలో 42 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో టెన్త్‌ చదువుతున్న బాలురు 1260, బాలికలు 1158, మొత్తం  2418మంది ఉన్నారు.

పనిచేయని సర్వర్లు..
ప్రభుత్వ హైస్కూళ్లలో 6 నుంచి 10వ తరగతికి సంబంధించి ప్రతి తరగతికీ బయోమెట్రిక్‌ మెషిన్‌ ఇచ్చారు. పంపిణీ చేసిన సమయంలో సర్వర్ల సమస్య కారణంగా పూర్తి స్థాయిలో వివరాలు నమోదు చేయలేకపోయారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే దీనిపై సమీక్షకు పూనుకున్నప్పటికీ సర్వర్లు పనిచేయకపోవడం గమనార్హం! దీంతో ఎక్కడ వేసిన బయోమెట్రిక్‌ అక్కడే అన్న చందాన మారింది. ఈ క్రమంలో టెన్త్‌ విద్యార్థుల హాజరు బయోమెట్రిక్‌లో ఎక్కడా నమోదు కాలేదని అధికారులు చెప్పడంతో ముఖ్య మంత్రి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో యుద్ధ ప్రాతిపదికన హెడ్మాస్టర్లు నమోదుకు పూనుకున్నారు.

అక్రమాలు అరికట్టేందుకేనా?
విద్యార్థులు తక్కువగా హాజరైనా ఎక్కువమంది హాజరైనట్లు రికార్డుల్లో నమోదు చేసి మధ్యాహ్న భోజన పథకం అమలులో అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు రావడంతో ప్రభుత్వం దీనికి చెక్‌ పెట్టే దిశగా విద్యార్థులకూ బయోమెట్రిక్‌ ట్యాగ్‌ తగిలించిందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు