చిన్నారులకు ఎంతకష్టం

29 Jan, 2019 11:53 IST|Sakshi
చికిత్స పొందుతున్న యాసిడ్‌ బాధితుడిని పరామర్శిస్తున్న అధికారులు

డిజిటల్‌ క్లాస్‌ రూంలో పగిలిన

‘సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌’ బాటిల్స్‌

ఐదుగురు విద్యార్థులకు గాయాలు

క్లాస్‌రూంలోనే ల్యాబ్‌ నిర్వహణ

వెంటాడుతున్న గదుల కొరత

ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కూడా..

చిత్తూరు, తిరుపతి రూరల్‌: డిజిటల్‌ క్లాస్‌రూంలో యాసి డ్‌ పొగలు చిమ్మాయి. చీకటి గదిలో సల్ఫ్యూ రిక్‌ యాసిడ్‌ బాటిల్స్‌ ప్రమాదవశాత్తూ పగిలిపోయి ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. సోమవారం తిరుపతి రూరల్‌ మండలం చెర్లోపల్లి జెడ్పీ హైస్కూల్లో దుర్ఘటన జరిగింది. ఈ హైస్కూల్లో 11  గదులున్నాయి. మరో మూడు అవసరమని ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరారు. అయినా స్పందన లేదు. దీంతో డిజిటల్‌ క్లాస్‌ రూంలోనే సైన్స్‌ ల్యాబ్‌ను నిర్వహిస్తున్నారు. సోమవారం సా యంత్రం 8వ తరగతి విద్యార్థులను డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌కు తీసుకెళ్లారు. తలుపులు మూసిప్రొజెక్టర్‌ ద్వారా పాఠాలు చూపించారు. విద్యార్థులను వదిలేసి ఉపాధ్యాయులు బయటకు వెళ్లారు. చీకటిలో ఓ విద్యార్థి చేయి తగిలి బల్ల మీదున్న సల్ఫూరిక్‌ యాసిడ్‌ బాటిల్స్‌ కింద పడ్డాయి. యాసిడ్‌ దగ్గరలోని  విక్రమ్‌కృష్ణ(పుదిపట్ల చైతన్యపురం),  తరుణ్‌(అరుణమ్మ కాలనీ) శివ(నం దమూరి కాలనీ),  వంశీ(మంగళం), దినేష్‌(వెదురుకుప్పం మండలం)పై పడ్డాయి. వంశీకి తీవ్రగాయాలయ్యా యి. వారిని తిరుపతి రుయాకు తరలించి తర్వాత ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు.

తరగతి గదుల కొరత వల్లే...
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చాలా చోట్ల తరగతి గదుల కొరత ఉంది. చెర్లోపల్లె తరహాలోనే చాలాచోట్ల తరగతి గదిలో సైన్స్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రమాదమని తెలిసినా మరో మార్గం లేకపోవటంతో తప్పడం లేదు. దీని వల్ల తమ పిల్లల ప్రాణాలతో ప్రభుత్వం, ఉపాధ్యాయులు చెలగాటమాడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. గదుల కొరత ఉంటే ప్రమాదంలోకి నెడతారా? అని ప్రశ్నిస్తున్నారు. యాసిడ్‌ బాధితులను తిరుపతి సబ్‌ కలెక్టర్‌ మహేష్‌కుమార్,  అర్బన్‌ తహసీల్దార్‌ చంద్రమోహన్, రూరల్‌ ఎంఈఓ ప్రేమలత పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు.  చెర్లోపల్లె హైస్కూల్‌ క్లాస్‌ రూమ్, సైన్స్‌ ల్యాబ్‌ను కూడా పరిశీలించారు. తరగతి గదిలోనే ల్యాబ్‌ను నిర్వహించటం వల్లే ఈ యాసిడ్‌ ఘటన జరిగినట్లు నిర్ధారించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

మరిన్ని వార్తలు