39 మంది విద్యార్థులకు అస్వస్థత

29 Dec, 2018 13:39 IST|Sakshi
అర్ధరాత్రి వేళ కిక్కిరిసిన పెద్దాసుపత్రిలోని పీడియాట్రిక్‌ వార్డు

అర్ధరాత్రి వేళ కిక్కిరిసిన పెద్దాసుపత్రి

మధ్యాహ్న భోజనం కలుషితం కావడమే కారణమంటున్న తల్లిదండ్రులు

కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు మండలం నందనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 39 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో పెద్దాసుపత్రిలో చేరారు. మధాŠయ్‌హ్న భోజనం కలుషితం కావడమే ఇందుకు కారణమని తల్లిదండ్రులు తెలిపారు. ఈ పాఠశాలకు శుక్రవారం మధ్యాహ్నం ప్రైవేట్‌ ఏజెన్సీ వారు వండిన అన్నం, పప్పు, చారు తెచ్చి విద్యార్థులకు వడ్డించారు. ఈ ఆహారం కలుషితం కావడంతో దాని ప్రభావం రాత్రి పొద్దుపోయిన తర్వాత చూపింది. ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురవుతూ వచ్చారు. గ్రామస్తులు ఆందోళన చెంది అంబులెన్స్‌లలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. కొందరికి వాంతులు, విరేచనాలు కాగా.. మరికొందరు కడుపునొప్పితో బాధపడుతున్నారు.

వారిని వైద్యులు పరీక్షించి అవసరమైన వారికి సెలైన్‌ ఎక్కించారు.  నందనపల్లెకు చెందిన గీతాంజలి (5వ తరగతి), ప్రియదర్శిని (4వ తరగతి), వర్షిణి (5వ తరగతి), పవన్‌ (4వ తరగతి), నిఖిల్‌ (2వ తరగతి), నిశాంత్‌గౌడ్‌ (2వ తరగతి) సాయికీర్తన (2వ తరగతి), హర్ష (2వ తరగతి)తో పాటు సూదిరెడ్డిపల్లెకు చెందిన స్నేహాంజలి తదితర విద్యార్థులను పెద్దాసుపత్రిలోని పీడియాట్రిక్‌ వార్డులో చేర్చారు.  పిల్లలకు అన్నం వడ్డించే లక్ష్మీదేవి కుమార్తె కల్యాణి కూడా మధ్యాహ్న భోజనం ఆరగించి అస్వస్థతకు గురైంది. ప్రస్తుతం ఆమె క్యాజువాలిటీలో చికిత్స పొందుతోంది.  

నేనూ అస్వస్థతకు గురయ్యా: హెడ్‌మాస్టర్‌
నేను కూడా మధ్యాహ్నం పాఠశాల భోజనమే తిన్నా. నాకు కూడా స్వల్పంగా అనారోగ్యం చేసింది. భోజనంలో ఏదైనా కలిసిందేమోనని అనుమానం.  

మరిన్ని వార్తలు