చదువులకు దూరం

13 Dec, 2018 07:44 IST|Sakshi

శ్రీకాకుళం :‘గ్రామీణ మధ్య తరగతి విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువులకు దూరమవుతున్నారు’ అని ఆమదాలవలస సాగర్‌ డిగ్రీ కాలేజీకి చెందిన బి.జగదీశ్వరి, మామిడి స్వాతి, జి.పావనికుమారి జగన్‌కు తెలిపారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సక్రమంగా రాకపోవడంతో తల్లిదండ్రులు భారం మోయలేకపోతున్నారని చెప్పారు. ఈ సమస్య మీరు సీఎం అయిన తర్వాత పరిష్కరించాలని కోరారు.  

బతుకు దుర్భరం
‘2005లో మీ నాన్నగారు నిరుపేదలమైన మమ్మల్ని గుర్తించి కాలనీ ఇచ్చారు. అప్పట్లో 570 కుటుంబాలు ఈ కాలనీలో గృహాలు నిర్మించుకునేందుకు సిద్ధమయ్యాం. అప్పట్లో వచ్చిన డబ్బులతో పునాదులు పూర్తి చేశాం. వైఎస్‌ మరణానంతరం మమ్మల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు’ అని ఆమదాలవలస మండలం సొట్టవానిపేట, టీజీఆర్‌ నగర్‌కు చెందిన ఎస్‌వీవీ నాగవిమల జగన్‌కు తెలిపారు. తాగునీరు, కాలువలు, స్కూల్‌ వంటి కనీస సదుపాయాలు లేవని చెప్పారు. మీరే ఆదుకోవాలని కోరారు. 

మరిన్ని వార్తలు