మూత‘బడి’..

13 Jun, 2018 10:16 IST|Sakshi
పాడేరు మండలం పనసపల్లిలో  తెరుచుకోని జీపీఎస్‌(టీడబ్లు్య) పాఠశాల 

మన్యం బడుల్లో ఉపాధ్యాయుల కొరత

తెరుచుకోని 77 ఏకోపాధ్యాయ పాఠశాలలు

ఏజెన్సీ గ్రామాలలో బడిబాట పట్టని బాలలు

డేరు మండలంలోని పనసపల్లి గ్రామంలోని జీపీఎస్‌ (టీడబ్ల్యూ) ఏకోపాధ్యాయ పాఠశాల ఇది. ఈ పాఠశాలలో 1 నుంచి 5 తరగతులున్నాయి. గతేడాది ఈ పాఠశాలలో పని చేసిన ఉపాధ్యాయిని పదవీ విరమణ చేశారు. దీంతో ఈ పాఠశాలకు టీచర్‌ కొర త ఏర్పడింది. వేసవి సెలవుల అనంతరం మంగళవారం పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ ఏకోపాధ్యాయ పాఠశాల కావడంతో ఉపాధ్యాయుడు లేక మంగళవారం ఈ పాఠశాల తెరుచుకోలేదు. ఈ పాఠశాలలో గతేడాది 16 మంది విద్యార్థులున్నారు. ఈ ఏడాది మరో ఆరుగురు బాలలు చేరవలసి ఉంది. పాఠశాల తెరుచుకోకపోవడంతో విద్యార్థులంతా ఇంటికే పరిమితమయ్యారు.


సాక్షి, పాడేరు : గిరిజన ప్రాథమిక విద్యాభివృద్ధి కోసం ఏజెన్సీ 11 మండలాల్లో గిరిజన సంక్షేమశాఖ ద్వారా 670 (జీపీఎస్‌) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండే మారుమూల గిరిజన గ్రామాల్లో బాలలకు  ప్రాథమిక విద్యను అందించేందుకు 30 ఏళ్ల క్రితం గిరిజన సంక్షేమశాఖ ఏజెన్సీ 11 మండలాల్లో గిరిజన విద్యా వికాస కేంద్రాలు (జీవీవీకే) పేరుతో ఏకోపాధ్యాయ పాఠశాలలను ప్రారంభించింది. జీపీఎస్‌ పాఠశాలలుగా పేరుమార్చి నేటికీ ఏకోపాధ్యాయులతోనే ఈ పాఠశాలలను నిర్వహిస్తోంది. 1 నుంచి 5 తరగతులుంటున్న ఈ పాఠశాలల్లో 30 నుంచి 50 వరకూ విద్యార్థులుంటున్నారు.

విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నా ఒక్క ఉపాధ్యాయుడే తరగతులలో బోధనతో నెట్టుకొస్తున్నారు. ఇదే మండల పరిషత్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అయితే అదనంగా టీచర్లను నియమిస్తున్నారు. కానీ జీపీఎస్‌ పాఠశాలల్లో మా త్రం 2వ ఉపాధ్యాయుడు నియామకమన్న ప్రశ్నే లేకుండా పోయింది. ఈ జీపీఎస్‌ పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడి వల్ల విద్యాబోధన కుంటుపడుతోంది. ప్రస్తుతం ఏజెన్సీలో 77 జీపీఎస్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏటా ఈ పాఠశాలల్లో వలంటీర్లుగానీ, సీఆర్టీలను  గాని నియమించే వరకూ ఈ పాఠశాలలు తెరుచుకోవడం లేదు. ప్రతి ఉపాధ్యాయుడికి ఏటా 22 వ్యక్తిగత సెలవులు ఉంటాయి. అదీగాక ప్రతీ నెల 2 రోజులు హెచ్‌ఎంల మీటింగ్, కాంప్లెక్స్‌ మీటింగ్‌లతోపాటు విద్యా ప్రణాళికలకు సం బంధించి అత్యవసర సమావేశాలు, ఉపాధ్యాయుల వ్యక్తిగత సెలవులు అన్నీ కలిపి ఏడాదికి కనీసం 40 రోజులు పాఠశాల మూతపడుతున్నా యి.

విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతీ పాఠశాలకు ఇద్దరు టీచర్లు ఉండాలనే నిబంధన ఈ జీపీఎస్‌ పాఠశాలలకు వర్తిం చడం లేదు. తరచూ పాఠశాలలు మూతపడుతుం డటం వల్ల గిరిజన ప్రాథమిక విద్య గాలివాటంగా మారింది. నేడు పాఠశాలలు పునః ప్రారంభమైనా ఉపాధ్యాయుల కొరత ఉన్నచోట ప్రాథమిక పాఠశాలలు మూతపడివున్న పరిస్థితి ఏర్పడింది. అలాగే ఏజెన్సీలోని 955 మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలు, 61 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు 175 ఉన్నాయి. ఏజెన్సీలో ఉపాధ్యాయుల కొరత వల్ల గిరిజన ప్రాథమిక విద్యాభివృద్ధిపై ప్రభావం చూపుతోంది.

>
మరిన్ని వార్తలు