బ్లడ్‌బ్యాంక్‌లో ఎస్‌డీపీ ప్రారంభం

24 Jul, 2016 00:16 IST|Sakshi
నెల్లూరు(అర్బన్‌): నెల్లూరు బ్లడ్‌బ్యాంక్‌లో శనివారం అత్యంత ఆధునికమైన సింగిల్‌ డోనార్‌ ప్లేట్‌ మిషన్‌ను(ఎస్‌డీపీ) ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో బ్లడ్‌బ్యాంక్‌ చైర్మన్‌ బీఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ తాము  బేథస్థా హోమ్స్‌ ఎన్‌జీవో ఆధ్వర్యంలో ఈ బ్యాంక్‌ను ప్రారంభించామన్నారు. ఇది ప్రైవేటు బ్లడ్‌ బ్యాంకు కాదన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు, ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ ధరల్లోనే రోగులకు రక్తం అందిస్తున్నామన్నారు. సాధారణంగా రోగులకు ప్లేట్‌లెట్స్‌ ఎక్కిస్తే 2వేల నుంచి 4వేల వరకు రక్తకణాలు పెరుగుతాయని తెలిపారు.  తాము ప్రవేశ పెట్టిన ఎస్‌డీపీ యంత్రంతో ఒకే సారి 50వేలకు పైగా రోగికి రక్తకణాలు పెరుగుతాయన్నారు. రోగికి శ్రమ, ఒత్తిడి తగ్గిపోతుందన్నారు. పేదలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా తక్కువకు కూడా రక్తాన్ని అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో రక్తం కొరత తీర్చేందుకు మాత్రమే బ్లడ్‌బ్యాంక్‌ను ఏర్పాటు చేశామన్నారు. బ్లడ్‌ బ్యాంక్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ మోపూరు భాస్కర్‌నాయుడు, డాక్టర్లు పెంచలప్రసాద్, సాయినాథ్, భార్గవహెల్త్‌ ప్లస్‌ సీఈఓ చంద్రశేఖర్‌రెడ్డి, స్వచ్ఛందసంస్థల అధ్యక్షుడు ఈవీఎస్‌ నాయుడు, మైత్రీ ఫౌండేషన్‌ చైర్మన్‌ జలదంకి సుధాకర్‌ పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు