కార్యదర్శుల చేతికి ఇసుక రీచ్‌లు

20 Feb, 2016 00:55 IST|Sakshi
కార్యదర్శుల చేతికి ఇసుక రీచ్‌లు

* జిల్లాలో 13 మండలాల్లోని 32 రీచ్‌లు అప్పగింత
* ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడినుంచే ఇసుక సరఫరా

విజయనగరం మున్సిపాలిటీ : ప్రభుత్వ నిధులతో చేపట్టే పనులకు ఇసుక కొరత లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. పంచాయతీ కార్యదర్శులకే రీచ్‌లపై అజమాయిషీ ఇచ్చి అవసరమైన ఇసుక  సరఫరాకు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యా ప్తంగా 13 మండలాల్లోని 32 రీచ్‌లను వారికి అప్పగిస్తూ భూగర్భ జల శాఖ అధికారుల నుంచి జిల్లా పంచాయతీ కార్యాలయానికి  ఉత్తర్వులు వచ్చాయి.

ఈ రీచ్‌ల ద్వారా కేవలం ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో చేపట్టే పనులకు మా త్రమే ఇసుక సరఫరా చేయనున్నారు.
 అంతేగాకుండా ఆ గ్రామ పంచాయతీలో ఇళ్లు నిర్మించుకుంటే దానిని నిజ నిర్ధారణ చేసుకుని సరఫరా చేయాలి. ఇంజినీరింగ్ అధికారులు ముందుగా జాయింట్ కలెక్టర్‌కు ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమో దరఖాస్తు చేసుకోవాలి. జేసీ ఆమోదించాక భూగర్భ గనుల శాఖ అధికారికి పంపిస్తారు. అక్కడి నుంచి జిల్లా పంచాయతీ అధికారి ద్వారా కార్యదర్శులకు ఆదేశాలు జారీ అవుతాయి.
 
క్యూబిట్ మీటర్‌కు రూ. 66లు
పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో నిర్వహించే ఇసుక రీచ్‌ల్లో ఇసుక ధర క్యూబిక్ మీటర్‌కు రూ. 66 గా నిర్ధారించినట్లు భూగర్బగనుల శాఖ ఏడీ మాధవరావు సాక్షికి తెలిపారు. జేసి అనుమతి ఇచ్చాక ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక కావాలో తెలుసుకుని తద్వారా వచ్చే మొత్తాన్ని కార్యదర్శి చలానా ద్వారా ప్రభుత్వానికి జమ చేస్తారు. దీని రవాణాకు కార్యదర్శే వే బిల్లు అందిస్తారు.
 
కార్యదర్శులకు కేటాయించిన ఇసుక రీచ్‌లివే...
  బొబ్బిలి మండలంలోని పారాది, పెంట, పారాది బిట్-3, పారాది బిట్-2,
  గుర్ల మండలంలోని గరికివలస, భూపాలపురం, కలవచర్ల, చింతలపేట, నడుపూరు
  గజపతినగరం మండలంలోని ఎం.ముగడాం-1, ఎం.ముగడాం-2,  ఎం.ముగడాం-3
  బలిజిపేట మండలంలోని పెద్దింపేట, అరసాడ,
  కొమరాడ మండలంలోని పూర్ణపాడు, కల్లికోట, దుగ్గి-2, దుగ్గి
  డెంకాడ మండలంలోని సింగవరం-2, సింగవరం-1
  దత్తిరాజేరు మండలంలోని పెదకాద
  రామభద్రపురం మండలంలోని రొంపిల్లి, కొట్టక్కి, గొల్లపేట
  సీతానగరంలోని పనుకుపేట, పెదంకలాం, పెదభోగిలి
  మెంటాడ మండలంలోని మెంటాడ
  పాచిపెంట మండలంలోని కర్రివలస
  జియ్యమ్మవలస మండలంలోని బిట్రపాడు
  ఎస్‌కోట మండలంలోని చామలపల్లి

మరిన్ని వార్తలు