శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి

31 Jul, 2014 03:24 IST|Sakshi
  • ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం
  •  అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టి  
  •  బాధ్యతలు చేపట్టిన ఎస్పీ
  • తిరుమల/ తిరుపతి అర్బన్: నిబద్ధతతో పనిచేస్తూ శాంతి, భద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తిరుపతి అర్బన్ నూతన ఎస్పీ గోపీనాథ్ జట్టి అన్నారు. గురువారం ఉదయం ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయంలో సంప్రదాయంగా ఫైల్‌పై ఎస్పీ సంతకం చేశారు. అనంతరం కుటుంబ సమేతంగా వేంకటేశ్వరస్వామిని, వకుళమాతను దర్శించుకున్నారు. తదుపరి తిరుపతి చేరుకుని ఎస్పీ కార్యాలయం లో ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు.
     
    ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి అర్బన్ ఎప్పీగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుమల, తిరుపతి భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. చిత్తూరు జిల్లాలోని ఇతర ప్రాంతాలు, తిరుపతి నగరం తనకు కొత్తేమీ కాదన్నారు. తాను ఇక్కడే వ్యవసాయ కళాశాలలో ఎంఎస్సీ చదివానన్నారు. గతంలో తమిళనాడులోనూ అటవీ శాఖకు సంబంధించిన శిక్షణ తీసుకున్నానని వెల్లడించారు. ఆ కారణంగా అటవీ శాఖపై కూడా పూర్తి పట్టు ఉందని, శేషాచల అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. అందుకోసం ప్రస్తుత అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని అక్రమ రవాణాను అదుపు చేస్తామని వివరించారు.

    తిరుపతిలాంటి పుణ్యక్షేత్రంలో విధులు నిర్వర్తించడం అదృష్టంగా భావించడమే కా కుండా సంతోషంగా ఉందన్నారు. అదే తరుణంలో దేశం నలుమూలల నుంచి వచ్చే వేలాదిమంది యా త్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని లా అండ్ ఆర్డర్‌ను పటిష్టం చేస్తామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి మరింత లోతుగా అధ్యయ నం చేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. తిరుపతి నగరం రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో అల్లరి మూకలను కూకటివేళ్లతో పెకలిం చి వేసేందుకు ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తామన్నారు.

    దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీ సుకుంటామని తెలిపారు. అనంతరం ఎస్పీ పోలీసు అధికారులతో శాంతిభద్రతలపై సమీక్షించారు. కొత్త గా బాధ్యతలు చేపట్టిన అర్బన్ ఎస్పీని విజిలెన్స్ అం డ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ రవిశంకర్‌రెడ్డితోపాటు ఏఎస్పీలు, అర్బన్ జిల్లా పరిధిలోని పలువురు డీఎస్పీ లు, సీఐలు, నగరంలోని ప్రముఖులు కలసి పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు శ్రీవారి సందర్శన సమయంలో ఎస్పీ వెంట తిరుపతి ఏఎస్పీ సిద్ధారెడ్డి, డీఎస్పీ నరసింహారెడ్డి, సీఐ విజయశేఖర్, ఎస్‌ఐ తిమ్మయ్య ఉన్నారు.
     

మరిన్ని వార్తలు