జీవోఎంకు సీమాంధ్ర బీజేపీ నివేదిక

26 Oct, 2013 03:55 IST|Sakshi

విజయవాడలో పార్టీ నేతల కసరత్తు
 సాక్షి, హైదరాబాద్ : సీమాంధ్ర సమస్యల్ని పరిష్కరించిన తర్వాతే రాష్ట్ర విభజన బిల్లుకు పార్లమెంటులో మద్దతు ఇవ్వాలని ఇప్పటికే ప్రకటించిన బీజేపీ ఆ ప్రాంత ఉద్యమ కమిటీ ఈసారి మరో అడుగు ముందుకు వేసింది. పార్టీ రాష్ట్ర నాయకత్వంతో నిమిత్తం లేకుండా నేరుగా కేంద్ర నాయకత్వానికి, విభజనపై ఏర్పాటయిన మంత్రుల బృందానికి తమ నివేదికను అందజేయాలని నిర్ణయించింది. పార్టీ సీనియర్ నేత, సీమాంధ్ర ఉద్యమ కమిటీ నేత డాక్టర్ కె. హరిబాబు అధ్యక్షతన శుక్రవారం విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. సీనియర్ నాయకులు ప్రొఫెసర్ శేషగిరిరావు, శాంతారెడ్డి, సోము వీర్రాజు, సురేష్‌రెడ్డి, యడ్లపాటి రఘునాథ్‌బాబు, జె. రంగరాజు తదితరులు పాల్గొన్న ఈ సమావేశానికి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డిని ఆహ్వానించలేదు. జీవోఎంకు సమర్పించాల్సిన నివేదిక ముసాయిదా తయారీపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో తలెత్తే పది కీలక అంశాలను జిల్లాల వారీగా చర్చించారు. ఈ నెల 28, 29 తేదీల్లో ఢిల్లీకి వెళ్లి  నివేదికను పార్టీ కేంద్ర నాయకత్వానికి అందజేస్తామని, వారు సూచించే సవరణలు చేసి జీవోఎంకు నివేదిక సమర్పిస్తామని వారు తెలిపారు. అలాగే.. బీజేపీ తెలంగాణ నేతలు వేరుగా జీవోఎంకు మరో నివేదికను అందజేయనున్నట్లు తెలిసింది.
 
 సీమాంధ్ర బీజేపీ నివేదించే అంశాలివీ...
 -    1953 నాటి రాష్ట్ర విభజన మాదిరి కాకుండా అత్యధికంగా నష్టపోయే రాయలసీమకుప్రత్యేక ప్యాకేజీతో పాటు చట్టబద్ధమైన హక్కులు ఉండేలా చూడాలి.
  -   పోలవరం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు 200 టీఎంసీల గోదావరి జలాలు
-  సరఫరా చేసేందుకు చట్టబద్ధత కల్పించాలి. బ్రాహ్మణి స్టీల్ ప్రాజెక్టు చిక్కుల్లో పడి
-నందున దాన్ని జాతీయం చేసి రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీగా పేరు మార్చి 20 వేల
మందికి ఉపాధి దక్కేలా చూడాలి.  విశాఖ, గుంతకల్‌లో రైల్వే జోన్లు, నందలూరు
-కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ధి, కృష్ణా జలాలపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి.   భద్రా చలం డివిజన్‌ను సీమాంధ్రలో కలిపి పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలోపు పూర్తిచేయాలి.     పోర్టుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి.

>
మరిన్ని వార్తలు