సీమాంధ్ర నేతల ముందు మూడు ప్రతిపాదనలు!

4 Oct, 2013 12:58 IST|Sakshi

హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటు నోటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపడంతో...  భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు.  సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. భవిష్యత్‌ కార్యాచరణపై నాయకులు మల్లాగుల్లాలు పడుతున్నారు.  

విభజనపై ముఖ్యమంత్రి కిరణ్‌ చేతులెత్తేయడంతో సీమాంధ్ర నేతలు  ఆందోళన చెందుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.  అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే మంచిదనే ఆలోచన చాలా మంది చేస్తున్నట్టు సమాచారం.  

మొత్తం మీద రెండు, మూడు ప్రతిపాదనలు సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకుల పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.  మూకుమ్మడి రాజీనామాలు చేయడం ఒక ప్రతిపాదనైతే..  పదవుల్లో కొనసాగుతూ అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం ఓడించడం మరో ప్రతిపాదన. ఇవేవి కాకపోతే... విభనజకు సహకరించడం ఉత్తమమనే ప్రతిపాదన కూడా సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకుల పరిశీలనలో ఉంది.

మరిన్ని వార్తలు