ఢిల్లీ బయలుదేరిన సీమాంధ్ర మంత్రులు

25 Jul, 2013 21:14 IST|Sakshi

హైదరాబాద్ : సమైక్యవాదం ఊపందుకున్న నేపధ్యంలో సీమాంధ్ర మంత్రులు ఢిల్లీ బయలుదేరారు. రాష్ట్రాన్ని విడదీయవద్దని అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు వారు ఢిల్లీ వెళుతున్నారు. సమైక్యాంధ్ర కోసం వారు రాజీనామాలు చేయడానికి కూడా సిద్దపడుతున్న విషయం తెలసిందే.
మంత్రులు రేపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ను కలుస్తారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరతారు.  ఢిల్లీ బయలుదేరిన మంత్రులలో  కొండ్రు మురళి, వట్టి వసంత కుమార్, కాసు కృష్ణా రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి , టీజీ వెంకటేష్, మహీధర రెడ్డి ఉన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు