ఎంపీలంతా రాజీనామా చేయాల్సిందే: అశోక్బాబు

23 Sep, 2013 11:22 IST|Sakshi

సమైక్య రాష్ట్రానికి మద్దతుగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలంతా రాజీనామా చేయాల్సిందేనని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక చైర్మన్, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు డిమాండ్ చేశారు. అలా రాజీనామాలు చేయని వారికి రాజకీయ భవిష్యత్తు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

అనంతపురం జిల్లాలో జోరుగా సాగుతున్న సమైక్యాంధ్ర ఆందోళనల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. అక్కడ విలేకరులతో మాట్లాడారు. అసలు యూపీఏ ప్రభుత్వమే సంక్షోభంలో ఉన్నప్పుడు.. తెలంగాణ నోట్ను ఎలా ప్రవేశపెడతారని ఆయన ప్రశ్నించారు. మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో పార్టీ యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో కూడా సమైక్య ఉద్యమం కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు