రగులుతున్న సీమాంధ్ర జిల్లాలు

4 Oct, 2013 09:46 IST|Sakshi

హైదరాబాద్ :  కేంద్ర కేబినెట్‌ నోట్‌కు వ్యతిరేకంగా సీమాంధ్రలో బంద్‌ కొనసాగుతోంది. రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర మంత్రిమండలి తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి నిరసనగా  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన 72 గంటల బంద్‌ సీమాంధ్రలో జరుగుతోంది.

కేంద్ర మంత్రివర్గ నిర్ణయం వెలువడిన కొద్దిసేపటికే పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా 72 గంటల బంద్‌ పాటించాలని నిర్ణయించినట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. సీమాంధ్రలోని 1౩ జిల్లాల్లో ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. ఎక్కడికక్కడ సమైక్యవాదులు ఆందోళనలు ఉధృతం చేశారు. ఉదయం నుంచే వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, సమైక్యవాదులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలియచేస్తున్నారు.

మరిన్ని వార్తలు