ఐదుగురు టీడీపీ ఎంపీల రాజీనామా

2 Aug, 2013 17:33 IST|Sakshi
ఐదుగురు టీడీపీ ఎంపీల రాజీనామా

సీమాంధ్రకు మద్దతుగా ఐదుగురు టీడీపీ ఎంపీలు రాజీనామా చేశారు. మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, కొనకళ్ల నారాయణ, సీఎం రమేష్‌, వై సుజనాచౌదరి, నిమ్మల కిష్టప్ప తమ పదవులకు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. సీమాంధ్ర ప్రజల అభీష్టం మేరకే తాము రాజీనామా చేశామని వారు తెలిపారు.

సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బతీసిందని వారు ఈ సందర్భంగా విమర్శించారు. ఏ కమిటీ నిర్ణయాలు పరిగణనలోకి తీసుకుని విభజనకు మొగ్గుచూపారని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో సీమాంధ్ర ప్రజలు నష్టపోయే పరిస్థితి తలెత్తిందన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం స్వార్థపూరితమని ఎంపీలు మండిపడ్డారు.

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ఐదు రోజులు ఉందని, ఈ 5 రోజుల్లో ఏమైనా జరగొచ్చని వారు అన్నారు. బిల్లు ఆమోదం పొందకుండానే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు అనుకూలమా, వ్యతిరేకమా అన్న ప్రశ్నకు టీడీపీ ఎంపీలు సూటిగా సమాధానం చెప్పలేదు. సీమాంధ్ర ప్రజల హక్కుల కోసం పోరాడతామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు