శ్రీకాకుళంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌కు అవాంతరాలు

6 Jun, 2016 19:46 IST|Sakshi

ఎచ్చెర్ల (శ్రీకాకుళం) : ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి జిల్లాలో సోమవారం ప్రారంభం కావాల్సిన వెబ్ కౌన్సెలింగ్‌కు అవాంతరాలు ఎదురయ్యాయి. ఉదయం 9.30 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా... సర్వర్లు అనుసంధానం కాకపోవటంతో కౌన్సెలింగ్ నిలిచి పోయింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పురుషుల పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రంలో కౌన్సెలింగ్ ఉదయం ప్రారంభించారు. అయితే సర్వర్లు నిలిపోయూయి. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పారంభమవుతాయని అధికారులు చెప్పారు.

విద్యార్థులు నిరీక్షించినప్పటికీ... సాయంత్రం వరకు సర్వర్లు పని చేయలేదు. రాత్రి సమయంలో సిబ్బందిని పెంచి కౌన్సెలింగ్ పూర్తి చేయాలని ఉన్నత విద్యా మండలి హెల్ప్ లైన్ సెంటర్ల సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో 5000 ర్యాంకు లోపు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు సోమవారం పరిశీలించాల్సి ఉండగా, 148 మంది విద్యార్థులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు