ఏపీలో సేవా కార్యక్రమాలు

9 Jul, 2016 03:15 IST|Sakshi

సాక్షి నెట్‌వర్క్ :  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 67వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు రక్తదాన శిబి రాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిం చారు. తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ జయంతిని పండుగలా నిర్వహించారు. స్థానిక నేతలు పేదలు, వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. విజయనగరం ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి 1000 కొబ్బరి కాయలు కొట్టారు.

విశాఖ సిటీతో సహా జిల్లా వ్యాప్తంగా పార్టీలకతీతంగా ప్రజలు వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహించారు. భీమవరంలో స్థానికనేతలు చీరలు పంపిణీ చేశారు. తాడేపల్లిగూడెంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. గుంటూరు జిల్లా రెంటచింతలలో వైఎస్‌ఆర్ మైత్రీ యూత్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతపురంలో  అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. పుట్టపర్తిలో అన్నదానం, రక్తదానాలు చేశారు. కర్నూలులో అనాథలకు, వృద్ధులకు, విద్యార్థులకు బ్రెడ్డు, పండ్లు, పుస్తకాలు పంపిణీ చేశారు.

 తిరుపతిలో విద్యార్థి విభాగం.. తంబళ్లపల్లిలో రెడ్‌క్రాస్‌సొసైటీ.. వైఎస్సార్ అభిమానుల నేతృత్వంలో రక్తదాన శిబిరాలు జరిగాయి. కడపలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున యువకులు రక్తదానం చేశారు. మైదుకూరులోని వికలాంగుల పాఠశాల విద్యార్థులకు పార్టీ నేతలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాజంపేటలోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద వైఎస్‌ఆర్‌సీపీ పట్టణ నాయకులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు