26 నుంచి సచివాలయ సేవలు..

24 Jan, 2020 19:30 IST|Sakshi

ఇక  పౌరసేవలన్నీ సచివాలయాల ద్వారానే..

రెండు నెలల్లో అందుబాటులోకి పూర్తిస్థాయి సేవలు

రాష్ట్ర మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ వెల్లడి

సాక్షి, విజయవాడ: ఈ నెల 26 నుంచి వార్డు సచివాలయాల్లో సేవలు ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ వెల్లడించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని పౌర సేవలు సచివాలయాలు ద్వారా అందిస్తామని.. దేశంలో ఇన్ని సేవలు.. గ్రామాలు, వార్డుల్లో అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. సచివాలయాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించామని.. వచ్చే నెల నుంచి వార్డు సచివాలయాలు,వాలంటీర్ల ద్వారా పింఛన్ల చెల్లింపులు చేస్తామని చెప్పారు. రెండు నెలల్లో మొత్తం సేవలన్నీ అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. 24 గంటల్లో కొన్ని, 72 గంటల్లో కొన్ని సేవలను అందిస్తామని వివరించారు. ప్రతి రోజు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. దరఖాస్తులు సచివాలయంలోనే చేసుకోవచ్చని తెలిపారు. మున్సిపాలిటీల్లో ప్రజలకు ఈ సచివాలయాలు ద్వారా తక్షణ సేవలు అందుతాయని కమిషనర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు