'ఆ ఎన్కౌంటర్లన్నీ బూటకం'

8 Apr, 2015 17:10 IST|Sakshi

చిత్తూరు: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లన్నీ బూటకమంటూ కరుణాకరణ్ అనే వ్యక్తి ఘాటుగా విమర్శించాడు. పోలీసుల జరిపిన కాల్పుల్లో తిరువన్నామళైకు చెందిన మునిస్వామి అనే కూలీ మృతిచెందాడు. సోదరుడి మృతిపై స్పందించిన కరుణాకరణ్ బుధవారం విలేకరులతో మాట్లాడాడు. కూలీ కోసం తమ సోదరుడు ఎన్నో ప్రాంతాలకు వెళ్తుంటాడనీ, కూలీ కోసం చిత్తూరు జిల్లా నగరికి వెళ్లిన తన సోదరుడు ఇలా విగతజీవిలా కనిపించాడంతో తమ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయిందని వాపోయాడు. సోదరుడి మృతిపై న్యాయపోరాటం చేస్తామని చెప్పాడు.

సోదరుడు మునిస్వామితో పాటు తమ గ్రామం నుంచి 8మంది కూలీలు వెళ్లారనీ, వారిలో ఏడుగుర్ని చిత్తూరు జిల్లా నగరి వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా చెప్పాడు.  అయితే వారిలో ఒకరు తప్పించుకున్నట్టుగా కరుణాకరణ్ అన్నాడు. పోలీసుల అదుపులో ఉన్న ఏడుగురు ఇప్పడు శవాలుగా కనిపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది కచ్చితంగా బూటకపు ఎన్కౌంటరేనని కరుణాకరణ్ మండిపడ్డాడు.

మరిన్ని వార్తలు