ఏపీలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ

21 Jun, 2017 19:38 IST|Sakshi
ఏపీలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది. మొత్తం 18 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఇందులో విశాఖపట్టణం జిల్లా మినహా మిగతా 12 జిల్లాలకు కొత్త ఎస్‌పీలను నియమించింది. 12 జిల్లాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్‌పీలను బదిలీ చేసి వారి స్థానంలో కొత్త వారిని నియమించింది. ఈ బదిలీల్లో భాగంగా 9 మంది ఐపీఎస్‌లకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. వీళ్లను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.

జి. విజయ్‌కుమార్‌, ఎం. రవి ప్రకాశ్‌, ఎల్‌కె.వి. రంగారావు, బాస్కర్‌ భూషణ్‌, జి. శ్రీనివాస్‌, ఎ. రవికృష్ణ, ఆర్‌. జయలక్ష్మి, జె. బ్రహ్మారెడ్డి, కె.నారాయన్‌ నాయక్‌లను డీజీపీ కార్యాలయంలో తదుపరి పోస్టింగ్‌ నిమిత్తం రిపోర్టు చేయాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ బదిలీలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా ఎస్‌పీలగా నియమించే వారిని స్వయంగా ఇంటికి పిలిపించుకుని కౌన్సిలింగ్‌ నిర్వహించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ కౌన్సిలింగ్‌ కొనసాగిందనేది అధికార వర్గాల సమాచారం. గుంటూరు పట్టణ, గ్రామీణ, అలాగే చిత్తూరు ఎస్‌పీ, తిరుపతి పట్టణ ఎస్‌పీలు కూడా బదిలీ అయిన వారిలో ఉన్నారు.

1.శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా త్రివిక్రమ వర్మ
2. విజయనగరం జిల్లా ఎస్పీగా-పాలరాజు
3. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా- విశాల్‌ గున్నీ
4. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా- రవిప్రకాశ్‌
5. కృష్ణాజిల్లా ఎస్పీగా- సర్వశ్రేష్ణ త్రిపాఠి
6. గుంటూరు అర్బన్‌ ఎస్పీగా- అభిషేక్‌ మహంతి
7. గుంటూరు రూరల్‌ ఎస్పీగా-అప్పలనాయుడు
8. ప్రకాశం జిల్లా ఎస్పీగా- సత్య ఏసుబాబు
9. నెల్లూరు జిల్లా ఎస్పీగా- పీహెచ్‌డీ రామకృష్ణ
10.చిత్తూరు జిల్లా ఎస్పీగా- రాజశేఖర్‌
11. తిరుపతి ఎస్పీగా- విజయరావు
12. అనంతపురం జిల్లా ఎస్పీగా- జీవీజీ అశోక్‌ కుమార్‌
13. వైఎస్‌ఆర్‌ జిల్లా ఎస్పీగా బాబుజీ
14. కర్నూలు జిల్లా ఎస్పీగా-గోపీనాథ్‌ జెట్టి
15. విజయవాడ డీసీపీగా- గజరావు భూపాల్‌
16. విజయవాడ లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ- క్రాంతిలాల్‌ టాటా
17.విశాఖ లా అండ్‌ ఆర్డర్ డీసీపీ‌- టి.రవికుమార్‌ మూర్తి
18. వైఎస్‌ఆర్‌ జిల్లా ఇంటెలిజెన్స్‌ ఎస్పీ- ఫకీరప్పా

మరోవైపు ఐపీఎస్‌ అధికారుల జీవోలోను తప్పులు దొర్లాయి. రవిప్రకాశ్‌ను పశ్చిమ గోదావరి జిల్లాకు ఎస్పీగా నియమిస్తూ ఒకసారి, డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్‌ చేస్తూ మరోసారి ఆ జోవోలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు