పెథాయ్‌ ఎఫెక్ట్‌: ఏపీలో పలు రైళ్లు రద్దు

17 Dec, 2018 08:31 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీకి పెథాయ్‌ తీవ్ర తుపాన్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే(ఎస్‌సీఆర్‌) అప్రమత్తమైంది. ఏపీలో రాకపోకలు సాగించే పలు ప్యాసింజర్‌ రైళ్లను సోమవారం రద్దు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా తుపాన్‌పై అప్రమత్తంగా ఉండాలని ఎస్‌సీఆర్‌ జీఎం వినోద్‌ కుమార్‌ అధికారులకు సూచించారు. రైలు పట్టాల వెంబడి నిరంతరం గస్తీని కొనసాగించాలన్నారు. అలాగే గుంటూరు, విజయవాడల్లో హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

మరోవైపు తీవ్ర తుపాన్‌గా మారిన పెథాయ్‌ శరవేగంగా దూసుకొస్తుంది. కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాన్‌ తూర్పు గోదావరి జిల్లా వైపు వేగంగా కదులుతుంది. పెథాయ్‌ సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని, యానాం లమధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాన్‌ తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. తుపాన్‌ ప్రభావంతో తూర్పుగోదారి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురవనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. వర్షాలకు ఇప్పటికే పలు జిల్లాలో పంట నీట మునిగింది.

సోమవారం రద్దైన రైళ్ల వివరాలు..
1. ట్రైన్‌ నెం. 67300, విజయవాడ-రాజమండ్రి, మెము ప్యాసింజర్‌
2. ట్రైన్‌ నెం. 67295, రాజమండ్రి-విశాఖపట్నం, మెము ప్యాసింజర్‌
3. ట్రైన్‌ నెం. 67244, విశాఖపట్నం-కాకినాడ పోర్టు, మెము ప్యాసింజర్‌
4. ట్రైన్‌ నెం. 67242, కాకినాడ పోర్టు-విజయవాడ, మెము ప్యాసింజర్‌
5. ట్రైన్‌ నెం. 67221, విజయవాడ-తెనాలి, మెము ప్యాసింజర్‌
6. ట్రైన్‌ నెం. 67222, తెనాలి-గుంటూరు, మెము ప్యాసింజర్‌
7. ట్రైన్‌ నెం. 67225, గుంటూరు-తెనాలి, మెము ప్యాసింజర్‌
8. ట్రైన్‌ నెం. 67226, తెనాలి-విజయవాడ, మెము ప్యాసింజర్‌
9. ట్రైన్‌ నెం. 67227, విజయవాడ-తెనాలి, మెము ప్యాసింజర్‌
10. ట్రైన్‌ నెం. 67228, తెనాలి-గుంటూరు, మెము ప్యాసింజర్‌
11. ట్రైన్‌ నెం. 67296, విశాఖపట్నం-రాజమండ్రి, మెము ప్యాసింజర్‌
12. ట్రైన్‌ నెం. 67241, విజయవాడ-కాకినాడ పోర్ట్‌, మెము ప్యాసింజర్‌
13. ట్రైన్‌ నెం. 77242, రాజమండ్రి-భీమవరం, డెము ప్యాసింజర్‌
14. ట్రైన్‌ నెం. 77237, భీమవరం-రాజమండ్రి, డెము ప్యాసింజర్‌
15. ట్రైన్‌ నెం. 77238, రాజమండ్రి-భీమవరం, డెము ప్యాసింజర్‌
16. ట్రైన్‌ నెం. 77231, భీమవరం-నిడదవోలు, డెము ప్యాసింజర్‌
17. ట్రైన్‌ నెం. 77240, నిడదవోలు-భీమవరం, డెము ప్యాసింజర్‌
18. ట్రైన్‌ నెం. 77206, భీమవరం-విజయవాడ, డెము ప్యాసింజర్‌
19. ట్రైన్‌ నెం. 77294, రాజమండ్రి-నర్సాపూర్‌, డెము ప్యాసింజర్‌
20. ట్రైన్‌ నెం. 77295, నర్సాపూర్‌-గుంటూరు, డెము ప్యాసింజర్‌
21. ట్రైన్‌ నెం. 77230, గుంటూరు-విజయవాడ, డెము ప్యాసింజర్‌
22. ట్రైన్‌ నెం. 77269, విజయవాడ-మచిలీపట్నం, డెము ప్యాసింజర్‌

చదవండి: 
ప్ర‌జ‌లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌: ఆర్టీజీఎస్‌ హెచ్చరికలు 

అవనిగడ్డలో ఆకలి కేకలు

తరుముకొస్తున్న పెథాయ్‌
 

మరిన్ని వార్తలు