కోస్తాలో నిప్పుల ఉప్పెన! 

17 Jun, 2019 04:05 IST|Sakshi

మరో రెండు మూడ్రోజులపాటు తీవ్ర వడగాడ్పులు 

నిప్పులు చెరగనున్న భానుడు 

18 తర్వాత తగ్గుముఖం 

రాయలసీమకు ఒకట్రెండు రోజుల్లో ‘నైరుతి’ 

నాలుగు రోజుల్లో అల్పపీడనం 

వర్షాలు ఊపందుకునే చాన్స్‌

సాక్షి, విశాఖపట్నం/అమరావతి : నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే సమయంలో ఎప్పుడూ లేనంతగా భానుడు మరింత భగభగమంటున్నాడు. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడగాడ్పులు రాష్ట్రాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. మరో రెండు మూడ్రోజుల పాటు కోస్తాంధ్రలో ఇదే పరిస్థితి ఉంటుంది. సాధారణంకంటే ఐదు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే వడగాడ్పులుగాను, అంతకుమించి రికార్డయితే తీవ్ర వడగాడ్పులు గాను పరిగణిస్తారు. కానీ, కోస్తాంధ్రలో ఇప్పటికే 4–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమ, మంగళవారాలు అంతకు మించి ఉష్ణోగ్రతలు రికార్డయి తీవ్ర వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో వెల్లడించింది. దీంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర నిప్పుల కుంపటిలా మారనుంది.రాయలసీమలో మాత్రం సాధారణం కంటే 2–4 డిగ్రీలు మాత్రమే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఆయా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని సూచించింది.

ఒకట్రెండు రోజుల్లో రుతుపవనాలు
కాగా, ఒకట్రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. దీంతో ఈనెల 18 తర్వాత నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంవల్ల మూడు నాలుగు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అప్పట్నుంచి రాష్ట్రంలో వర్షాలు ఊపందుకునే అవకాశాలున్నాయి. మరోవైపు.. నైరుతీ రుతుపవనాలు నైరుతీ, వాయవ్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింతగా విస్తరించినట్లు హైదరాబాద్‌లోని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం కర్ణాటకలోని మంగళూరు, మైసూరు, తమిళనాడులోని సేలం, కడలూరు, ఒడిశాలోని గోపాలపురం, సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌ వరకు నైరుతీ రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కిలాడీ ‘యాప్‌’తో జర జాగ్రత్త!

‘నిజాయితీగా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు’

మిషన్‌కు మత్తెక్కింది

ఓటీపీ చెప్పాడు.. లక్షలు వదిలించుకున్నాడు

కూలి పనులకు వచ్చి కానరాని లోకాలకు..

సీబీఐ దాడి..జీఎస్టీ అధికారి అరెస్ట్‌ 

ఒకే సంస్థకు అన్ని పనులా!

రెవెన్యూ అధికారులే చంపేశారు

హత్యాయత్నానికి దారి తీసిన ఆధిపత్య పోరు

ట్రిపుల్‌ ఐటీ పూర్వ విద్యార్థికి లక్ష డాలర్ల వేతనం

టోల్‌ప్లాజా వద్ద 70 కేజీల గంజాయి పట్టివేత

దారి మరచి.. ఆరు కిలోమీటర్లు నడిచి..

నీటి పారుదల కాదు.. నిధుల పారుదల శాఖ

సోమిరెడ్డి..నిజనిర్ధారణ కమిటీకి సిద్ధమా?

తవ్వేకొద్దీ అక్రమాలే 

ఆగస్టు నుంచే ఇసుక కొత్త విధానం

ఆర్ట్, క్రాఫ్ట్‌ టీచర్లలో చిగురిస్తున్న ఆశలు

పవన విద్యుత్‌ వెనుక ‘బాబు డీల్స్‌’ నిజమే

40 ఏళ్ల సీనియరైనా రూల్స్‌ పాటించాల్సిందే

ఆర్భాటం ఎక్కువ.. అభివృద్ధి తక్కువ

పీపీఏలపై సమీక్ష అనవసరం

చరిత్ర సృష్టించబోతున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 

జూలై చివరి నాటికి చంద్రయాన్‌ 2

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు అరెస్ట్‌ వారెంట్‌

సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో నూతన ఇసుక పాలసీ

22 లేదా 23న ఏపీ గవర్నర్‌ బాధ్యతలు

నేరుగా మీ ఖాతాల్లోకి జీతాలు : బాలినేని

ఈనాటి ముఖ్యాంశాలు

టీడీపీ నేతలు ‘గడ్డి’ని కూడా వదల్లేదు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆయన తన మూడో కన్ను తెరిపించాడు..!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో