పశ్చిమాన జోరుగా ఉద్యమం

15 Aug, 2013 15:46 IST|Sakshi

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ పోరుగడ్డ పశ్చిమగోదావరి జిల్లా కదం తొక్కుతోంది. ఏలూరు కేంద్రంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్‌లో కేంద్రమంత్రుల మాస్క్‌లతో మాక్ కోర్టు నిర్వహించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిని ఎండగడుతూ నిరసన వ్యక్తం చేశారు. విభజన నిర్ణయంపై సమైక్యవాదుల కలయిక టీమ్‌ పేరుతో మన సంతకం కార్యక్రమం నిర్వహించారు.

రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ వారం పాటు లక్ష సంతకాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక జిల్లాలో 13వ రోజు కూడా ప్రైవేట్, మేనేజ్‌మెంట్ స్కూల్‌ యాజమాన్యాల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో స్వాతంత్ర్య వేడుకలను శ్రీశ్రీ విద్యాసంస్థలు బహిష్కరించాయి. ఫైర్ స్టేషన్‌  సెంటర్‌లో వినూత్నంగా స్వాతంత్ర్య కార్యక్రమాలు నిర్వహించాయి.

ఇక ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) ఈనెల 20 వ తేదీ నుంచి ఆమరణ దీక్ష ప్రారంభించనున్నారు. మరోవైపు జేఏసీ నాయకులతో మంత్రి వట్టి వసంతకుమార్ సమావేశం అయ్యారు. రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రి వట్టిని కోరారు. కేంద్రం పెద్దలతో చర్చించి తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు