ఇద్దరు బాలికలపై లైంగిక దాడి

8 Dec, 2013 04:33 IST|Sakshi

పెద్దముడియం/ముద్దనూరు, న్యూస్‌లైన్ :  జమ్మలమడుగు నియోజకవర్గంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి జరిగింది. ఓ ఘటన పెద్దముడియం మండలంలో జరగగా మరో ఘటన ముద్దనూరు మండలంలో చోటు చేసుకుంది. పెద్దముడియం మండల పరిధిలోని జె.కొట్టాలపల్లెలో కూలి పనికి వచ్చిన 18 ఏళ్ల బాలికపై బాలవీరయ్య లైంగిక దాడి చేశాడంటూ ఫిర్యాదు అందినట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.
 ఎస్‌ఐ సమాచారం మేరకు ... ఇదే గ్రామానికి చెందిన బాలిక పత్తి చేనులోకి కూలి పనికి రావడంతో బాలవీరయ్య అనే వ్యక్తి ఆ బాలికపై లైంగికదాడి చేయగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారు పరుగున వచ్చారు. వారొచ్చేలోపే నిందితుడు బాలవీరయ్య పరారు కావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అతనిపై ఎస్సీ ఎస్టీ కేసుతోపాటు 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
 ముద్దనూరులో..
 ముద్దనూరులోని ఎస్వీ గిరి కాలనీకి చెంది న 15 ఏళ్ల బాలికపై అదే కాలనీకి చెందిన ఊసోళ్ల హరికృష్ణ లైంగిక దాడి చేసాడని  ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ యుగంధర్ తెలిపారు. ఆయన సమాచారం మేరకు... శనివారం మధ్యాహ్నం ఆ కాలనీలో ఉన్న బాలికపై హరికృష్ణ లైం గిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ నరసింహమూర్తి హరికృష్ణపై కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు