షాహిద్‌ మృతదేహం లభ్యం

16 Aug, 2019 07:50 IST|Sakshi
నీటిపై తేలియాడుతున్న షాహిద్‌ మృతదేహం

సాక్షి, కమలాపురం : కమలాపురం పట్టణం దర్గా వీధికి చెందిన షేక్‌ షాహిద్‌ (10) మృత దేహం లభ్యమయ్యింది. ఈ నెల 13వ తేదీన పట్టణ శివారులోని పెన్నా నదిలో నీట మునిగిన ఘటనలో ఒకరు మృతి చెందిగా మరో ముగ్గురు చిన్నారులు గల్లంతైన విషయం విధితమే. వారిలో షాహిద్‌ అనే బాలుని మృతదేహం గురువారం వల్లూరు మండలం చెరువుకిందిపల్లె సమీపంలో ఉన్న పెన్నా నదిలో లభ్యమైనట్లు ఎర్రగుంట్ల రూరల్‌ సీఐ కొండారెడ్డి తెలిపారు. కాగా అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. ‘‘నిన్ను కళ్లారా చూసేందుకు కూడా వీలు లేకుండా పోయిందే చిన్నా అంటూ’’తల్లిదండ్రులు ఖాదరు, సాబిరీన్‌లు మృతదేహంపై పడి బోరున విలపించారు. బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా మరో బాలుడు జాకీర్‌ మృతదేహం దొరకాల్సి ఉంది. మృతదేహం ఆచూకీ లభించక పోవడంతో జాకీర్‌ తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు సైతం ఆందోళన చెందుతున్నారు.

డీఎస్పీ పరిశీలన
గల్లంతైన చిన్నారుల కోసం చేపట్టిన గాలింపు చర్యలను కడప డీఎస్పీ సూర్య నారాయణ పర్యవేక్షించారు. గురువారం వల్లూరు మండంలోని చెరువుకిందిపల్లె, ఆదినిమ్మాయపల్లె ప్రాంతాల్లో డీఎస్పీ పర్యటించారు. రిస్క్యూ టీంకు సలహాలు, సూచనలు ఇచ్చారు. కాగా షాహిద్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించే వరకు డీఎస్పీ అక్కడే ఉన్నారు.నీటిపై తేలియాడుతున్న షాహిద్‌ మృతదేహం 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు