సీఎం జగన్ నిర్ణయాలు చరిత్రాత్మకం

2 Jul, 2020 13:44 IST|Sakshi

సాక్షి, అనంతపురం : సీఎం జగన్‌ నిర్ణయాలు చరిత్రాత్మకమని మంత్రి శంకర్‌నారాయణ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, తిప్పేస్వామిలతో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. చరిత్రలో ఒకేసారి 1088 అంబులెన్స్‌లను ప్రజలకు అందుబాటులో ఉంచడం ఎక్కడా జరగలేదని శంకర్‌నారాయణ పేర్కొన్నారు. సీఎం జగన్‌ గొప్ప మానవతావాది.. ఆయన చరిత్రలో నిలిచిపోతారన్నారు.

ప్రజల ప్రాణాలు రక్షించేందుకు సీఎం జగన్‌ చర్యలు అభినందనీయమని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రతీదీ రాజకీయం చేయడం చంద్రబాబుకు బాగా అలవాటైపోయిందన్నారు. కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు కుట్రల వల్లే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందలేదంటూ విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే ఆర్థిక బిల్లును చంద్రబాబు అడ్డుకున్నారని, నీచ రాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు అని దుయ్యబట్టారు.


చంద్రబాబు అనైతిక రాజకీయాల వల్లే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఆలస్యంగా అందుతున్నాయని ఎమ్మెల్యే తిప్పేస్వామి పేర్కొన్నారు.  మండలిలో ఆర్థిక బిల్లును టీడీపీ ఎమ్మెల్సీలు కావాలనే అడ్డుకున్నారన్నారు ప్రభుత్వ ఉద్యోగుల ఉసురు చంద్రబాబుకు తప్పదని, ఏపీ అభివృద్ధికి చంద్రబాబే అడ్డుగా ఉన్నారని ఆయన విమర్శించారు.

మరిన్ని వార్తలు