ఆగని అక్రమ రవాణా!

30 Jan, 2014 04:25 IST|Sakshi
ఆగని అక్రమ రవాణా!
  •      జిల్లా నుంచి తరలిపోతున్న ఎర్రచందనం
  •      పోలీసుకాల్పుల్లో కూలీ మృతే నిదర్శనం

  • చిత్తూరు (క్రైమ్), భాకరాపేట, న్యూస్‌లైన్: జిల్లా నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా ఆగలేదని మరోమారు రుజువైంది. ఎర్రావారిపాళెం మండలంలోని బొవ్మూజీకొండవద్ద పోలీసుల కాల్పు ల్లో ఎర్రకూలీ మృతిచెందడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల అటవీశాఖ అధికారుల హత్యతో ప్రభుత్వం కన్నెర్ర చేసింది. అటవీశాఖ ఉద్యోగులకు ఆయుధా లు ఇవ్వడానికి అంగీకరించింది. అటవీ, ఎస్‌టీఎఫ్ బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. దీంతో ఎర్రచందనం స్మగ్లర్లు వెనక్కు తగ్గారన్న భావన అధికారులు, ప్రజల్లో నెలకొంది.

    అయితే ఈ అంచనా తప్పని ఎర్రావారిపాళెం మండలంలో బుధవారం చోటు చేసుకున్న ఘటన రుజువు చేసింది. కల్యాణిడ్యామ్ సమీపంలోని పులిబోనువద్ద నుంచి కూంబిం గ్‌కు బయులుదేరిన ఎస్‌టీఎఫ్ బలగాలు నాలుగు బృందాలుగా విడిపోయూయి. పులిబోను నుంచి బయులుదేరిన పార్టీ ఎర్రావారిపాళెం వుండల పరిధిలోని బొవ్మూజీకొండ వైపు వెళ్లింది. ఇక్కడ సుమారు 70 మంది ‘ఎర్ర’ కూలీలు కంటపడ్డారు. వారిని వెంబడించేందుకు వెళ్లిన పోలీసులపై తిరగబడి రాళ్లవర్షం కురిపించారు. ఈ దాడిలో ఆర్‌ఎస్‌ఐ మురళి, వురో కానిస్టేబుల్‌కు గాయూలయ్యూయి. ఎస్‌టీఎఫ్ బలగాలు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ‘ఎర్ర’కూలీ(35) మృతి చెందాడు.

     రెండో ఘటన


     రెండేళ్ల క్రితం చంద్రగిరి సమీపంలోని  శ్రీవారి మెట్టు వద్ద 300 మంది కూలీలు కూంబింగ్ చేస్తున్న పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు కాల్పులకు దిగారు. తిరువళ్లూర్ జిల్లాకు చెందిన ఓ తమిళుడు కాల్పుల్లో గాయపడి మృతి చెందాడు. తాజాగా బొమ్మాజికొండ వద్ద జరిగిన కాల్పుల్లో ఓ కూలీ మృతి చెందాడు.

     ఆయుధాలు సిద్ధం చేసుకున్న కూలీలు

     పోలీసులు, అటవీ అధికారులపై దాడులు చేసి తప్పించుకోవడానికి తమిళ కూలీలు వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. అడవిలో ఓ వైపు దుంగలు మోస్తూనే మరోవైపు కొడవళ్లు, గొడ్డళ్లు చేతపట్టుకుని ప్రతిదాడికి పూనుకుంటున్నారు. ఇందుకు బుధవారం నాటి ఘటనే నిదర్శనం. పోలీసులకు ఎదురుబడ్డ తమిళ తంబీలు కొడవళ్లు, గొడ్డళ్లను పోలీసులపైకి విసిరేశారంటే వారు ఎంతకు తెగిస్తున్నారో అర్థమవుతోంది.
     
    గాలింపు ముమ్మరం
     
    కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చిత్తూరు ఎస్పీ రామకృష్ణ, తిరుపతి ఎస్పీ రాజశేఖర బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు శేషాచలం అడవుల్లో గాలింపు ముమ్మరం చేశాయి.

మరిన్ని వార్తలు