అరకు అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: చెట్టి ఫాల్గుణ

6 Nov, 2019 19:42 IST|Sakshi

సాక్షి, విశాఖ : వందకోట్లతో అరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల రోడ్లు అనుసంధాన పనులు త్వరలో ప్రారంభిస్తామని స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెట్టిఫాల్గుణ తెలిపారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 161 రోజుల ప్రభుత్వ పాలనపై ఎమ్మెల్యే ఫాల్గుణ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడేరులో మెడికల్‌ కళాశాలతోపాటు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న వివిధ పనులపై ప్రస్తావించారు. అరకు అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అరకు నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది వేలకు పైగా రైతులకు రైతు భరోసా అందిందని, వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ద్వారా 756 మందికి పైగా పదివేలు ప్రోత్సాహంగా ఇచ్చినట్లు వెల్లడించారు. సంతల్లోని రైతులకు షెడ్ల నిర్మాణానికి పంతొమ్మిది కోట్లు కేటాయించినట్లు.. 25 కి.మీ సీసీ రోడ్ల నిర్మాణానికి ఎనిమిది కోట్లు కేటాయించినట్లు తెలిపారు. లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ‍్వడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామానికి తాగునీరు సదుపాయం కల్పించనున్నామని చెట్టి ఫాల్గుణ వివరించారు. 

మరిన్ని వార్తలు