రూ.20 లక్షలు ఇస్తా..స్టోర్‌ ప్రారంభించండి

21 Nov, 2018 13:31 IST|Sakshi
జలవనరుల శాఖ అధికారులతో చర్చిస్తున్న శిల్పాచక్రపాణిరెడ్డి, పార్టీ నాయకులు

జలవనరుల శాఖ అధికారులతో శిల్పాచక్రపాణిరెడ్డి  

అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

శ్రీశైలంప్రాజెక్ట్‌:  సున్నిపెంటలోని కో–ఆపరేటీవ్‌ స్టోర్స్‌ను అధికార పార్టీ నాయకులు   ఆక్రమించుకోవడంపై  వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అ«ధ్యక్షుడు  శిల్పాచక్రపాణిరెడ్డి ఫైర్‌ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని   స్థానిక ప్రజల కోసం వెంటనే ఆ స్టోర్స్‌ను పునఃప్రారంభించాలని అధికారులను కోరారు. నిర్వహణ కోసం తన వంతుగా రూ. 20 లక్షలు ఇస్తానని చెప్పారు. ఈమేరకు మంగళవారం జలవనరుల శాఖ కార్యాలయంలో  క్యాంప్స్‌ అండ్‌ బిల్డింగ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌  పాండురంగయ్యతో  శిల్పా సమావేశమై చర్చించారు.  కో–ఆపరేటివ్‌ స్టోర్స్‌ భవనం, పక్కనున్న ఖాళీస్థలాలను  కబ్జా  చేస్తుంటే మీరేం చేస్తున్నారని ఈఈని శిల్పా ప్రశ్నించారు.  తక్షణమే పాలకమండలిపై   కేసు నమోదు  చేయించాలన్నారు.

  స్టోర్స్‌ భవనాలు, స్థలాలను రెవెన్యూ, పోలీసుల సహకారంతో సీజ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో కాలయాపన చేసినా, స్టోర్స్‌ తెరవకపోయినా స్థానిక ప్రజల కోసం  అదే స్థలంలో రూ.20 లక్షలతో  కల్యాణ మండపం  నిర్మించి ఇస్తానని చెప్పారు.  దీనిపై స్పందించిన ఈఈ పాండురంగయ్య, డీఈ సేనానంద్‌  10 రోజుల్లోగా స్టోర్స్‌ భవనాలు , ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని హామీచ్చారు. అలాగే బాధ్యులపై  కేసు  నమోదు చేస్తామని చెప్పారు.    సున్నిపెంటలో ఆక్రమణలు పెరిగిపోతున్నాయని, ఎవరిపైన చర్యలు తీసుకోవాలన్నా  అసభ్య పదజాలంతో దూషిస్తున్నారన్నారు. అధికారులతో చర్చించిన వారిలో శ్రీశైలం నియోజక వర్గ నేత శిల్పా భువనేశ్వర రెడ్డి, వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా సంయుక్త కార్యదర్శి వట్టి వెంకటరెడ్డి, మండల నాయకులు ఎంఎ రజాక్‌ , జింకా గుండయ్య యాదవ్, విష్ణు, హనుమన్న , బక్కన్న, గౌస్‌మొహిద్దీన్,  అంబేడ్కర్‌ న్యాయ సేవాసంఘం అధ్యక్షుడు మైలా తులసీరాం, దళిత సంఘం నాయకులు చందం గాలయ్య తదితరులు ఉన్నారు.    

మరిన్ని వార్తలు