ఔను.. లైంగిక వేధింపులే

10 Nov, 2018 11:45 IST|Sakshi
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న సీఐడీ ఎస్పీ అమ్మిరెడ్డి

వీడిన డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య కేసు

ఛేదించిన సిట్‌ దర్యాప్తు సంస్థ

ముగ్గురు వైద్యుల లైగింక వేధింపులే కారణమని నిర్ధారణ

తొలి నుంచి ‘సాక్షి’ చెబుతున్నదిదే!

బాధ్యులపై నెల రోజుల్లో చార్జిషీట్‌

చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : వైద్య రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యా శిల్పం లైంగిక వేధిపులకే బలైపోయిందని స్పష్టమైంది. పాఠాలు బోధించేవారే వేధించడంతో ఆత్మహత్య చేసుకుందని తేలింది. ఎస్వీ మెడికల్‌ కళాశాల (ఎస్వీఎంసీ) పీడియాట్రిక్‌ పీజీ విద్యార్ధిని డాక్టర్‌ శిల్ప మూడు నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సిట్‌ దర్యాప్తు చేసి  మిస్టరీని ఛేదించింది. పీడియాట్రిక్‌ విభాగానికి చెందిన ముగ్గురు వైద్యుల లైంగిక వేధింపులే కారణమని  సిట్‌ కుండ బద్ధలు కొట్టింది. నెల రోజుల్లో చార్జిషీట్‌ దాఖలు చేయనున్నట్లు ప్రకటించింది. ఆరోపణలు ఎదుర్కొంటు న్న  ముగ్గురు వైద్యులు  ముందస్తు బెయిలు పొం దినట్లు తెలిసింది. డాక్టర్‌ శిల్పపై లైంగిక వేధింపులు జరిగాయని ‘సాక్షి’ దినపత్రిక వరుస కథనాలను ప్రచురించింది.

ఇప్పుడు ఇవన్నీ వాస్తవాలని తేలింది.  ఎస్వీఎంసీ పీడియాట్రిక్‌ పీజీ ఫైనలియర్‌ విద్యార్థిని డాక్టర్‌ శిల్ప తనపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ఏప్రిల్‌లో గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ఆమె ఆరోపణలపై  ఏర్పాటైన రెండు కమిటీలు స్పష్టతనివ్వలేకపోయాయి. ఈ నేపథ్యం లో  శిల్ప ఓ సబ్జెక్టులో ఉత్తీర్ణురాలు కాలేకపోయిం ది. దీంతో ముగ్గురు వైద్యులు  ఏం చేస్తారన్న భయంతో ఆగస్టు 7న పీలేరులోని  ఆత్మహత్య  చేసుకుంది. దీనిపై విద్యార్థిలోకం నిరసించడంతో సిట్‌ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. 47 మంది సాక్షులను విచారించిన సిట్‌ ముగ్గురు వైద్యులే దోషులుగా తేల్చింది. సిట్‌ నివేదిక వెల్లడి కావడంతో వైద్యులపై ఎస్వీఎంసీ జూడాలు మండిపడుతున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని జూడాల సంఘం అధ్యక్షుడు వెంకటరరమణ  డిమాండ్‌ చేశారు. తక్షణం అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని వార్తలు