పట్టాలు తప్పిన షిరిడీ ఎక్స్‌ప్రెస్‌

3 Dec, 2019 11:14 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌: ఆంధ్రప్రదేశ్‌లో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి షిరిడీకి వెళుతున్న సాయినాథ్‌ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం ఉదయం పట్టాలు తప్పింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. అయితే రైల్వేస్టేషన్‌ను సమీపించిన రైలు నెమ్మదిగా రావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన రైల్వేకోడూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వేసిబ్బంది మరమ్మత్తు చర్యలు చేపట్టారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా ఈ ఘటనపై షిరిడీకి వెళ్తున్న భక్తులు ఆందోళన చెందుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా