కలతో ‘అనుసంధానం’

30 May, 2018 09:38 IST|Sakshi
సీన్‌ వివరిస్తూ..

ఆలోచింపజేస్తున్న కలకడ కుర్రాడి షార్ట్‌ ఫిల్మ్‌

కలల నేపథ్యంలో సాగే ‘అనుసంధానం’ లఘుచిత్రం

యూట్యూబ్‌లో పదిరోజుల్లో 50 వేలు, 25 రోజుల్లో లక్ష వ్యూస్‌ 

 సాక్షి, చిత్తూరు: సినిమా..కోట్లమందికి వినోదాన్ని అందించే మాధ్యమం. కానీ సినిమాలో నటిం చాలంటే? సినిమా తీయాలంటే? అబ్బో అది చాలా కష్టం..సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ ఉండాలి..లేదా డబ్బులు బాగా ఖర్చు పెట్టాలి..ఏదో ఒక ప్లాట్‌ ఫాం ఉండి తీరాలి..అన్నది ఒకప్పటి మాట. కానీ నేడు ఔత్సాహిక ఫిలిం మేకర్స్‌కు ప్రపంచంలోనే అతి పెద్ద ప్లాట్‌ఫాంగా యూట్యూబ్‌ అవతరించింది. మన జిల్లాలోని ఓ ఔత్సాహిక దర్శకుడు తీసిన ఓ లఘుచిత్రం నేడు యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. 25 రోజుల్లోనే లక్ష వ్యూస్‌ని దాటిపోయిన ఆ లఘు చిత్రమే అనుసంధానం.

ఇదీ అనుసంధానం కథ
నిద్రపోతూ కనేది కల..ప్రతి మనిషి కలల రా వడం కామన్‌. ప్రతి కల ఒకొక్క రంగులో వస్తుం ది. మనకు జరిగిన సంఘటనలను కలలో రూపంలో వస్తాయి. వాటిలో కొన్ని తిరిగి డ్రీమ్‌ ప్రొసెస్‌ ద్వారా చూడవచ్చు. అందులో మొదటిది లూసీ డ్రీమ్, రెండోవది మ్యూచ్‌వల్‌ డ్రీమ్‌ ఇలా నాలు గోదశలో నేరుగా దేవుడితో మాట్లాడవచ్చు అనే నేపథ్యంతో ఈ షార్ట్‌ఫిల్మ్‌ తీశారు. కాస్త ఉత్కంఠ, ప్రేమ, లాజిక్, సస్పెన్స్‌ జోడించి తీసిని ఈ ఫిల్మ్‌ను యూట్యూబ్‌లో పది రోజుల్లో 50 వేల పైచిలుకు మంది చూశారు.

నేపథ్యం
జిల్లాలోని కలకడ ప్రాంతం వ్యవసాయ కుటుం బానికి చెందిన చంద్ర, నిర్మలల ఏకైక కుమారుడు ఆనంద్‌. 2013వ సంవత్సరంలో రాజంపేట అన్నమచార్యులు కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుకొనే సమయంలో సినీ హీరో నాగార్జున షార్ట్‌ఫిల్మ్‌ పోటీలు మాటీవీలో నిర్వహించారు. అప్పుడు మక్కువతో కళాశాలలో జరుగుతున్న ర్యాగింగ్‌ పై క్రేజీబాయ్స్‌ అనే షార్ట్‌ఫిల్మ్‌ తీసి పోటీలకు పంపిం చాడు. అందులో ఎంపిక కాకపోయిన కళాశాలలో నిర్వహించిన పోటీల్లో ఆ షార్ట్‌ఫిల్మ్‌కు ఉత్తమ బహుమతి లభించింది. ఆ ప్రోత్సాహంతో విద్యార్థుల మధ్య ఉండే ఇగోల నేపథ్యంలో అ+ఈ+ ఫార్ట్‌ఫిల్మ్‌ తీశారు. దానికి మరింత ఆదరణ లభించడంతో మూడో ఫిల్మ్‌ తీయాలని సంకల్పం తో ఇంటికి బైక్‌లో వస్తుండగా చంద్రగిరి వద్ద ప్రమాదానికి గురయ్యాడు. దీంతో రెండేళ్ల పాటు విశ్రాంతిలో ఉండాల్సి వచ్చింది.

సినీ రచయిత నుంచి ప్రశంస
‘అనుసంధానం’ను చూసిన ప్రముఖ సినీ రచయిత వెలిగొండ శ్రీనివాస్‌(అఖిల్‌ సినిమా కథ రచయిత) ఆనంద్‌కు కాల్‌ చేసి ప్రశంసించారు. నయనతారతో లేడిఓరియెంటెడ్‌ సినిమా తీయాలని చూస్తున్నాం. అందుకు తగిన కథ అవసరమని అడిగారని ఆనంద్‌ తెలిపాడు. అందుకు తగ్గట్టుగా తను కూడా కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. సో ఆల్‌ ది బెస్ట్‌ టు ఆనంద్‌.

సినిమా తీయాలి
సరాదాగా ప్రారంభమైన షార్ట్‌ఫిల్మ్‌ ఆసక్తి నా లక్ష్యంగా మారింది. ఆ ఫిల్మ్‌ తీస్తున్న దశలో ప్రమాదం జరగడంతో రెండు సంవత్సరాలు రెస్ట్‌లో ఉన్నాను. ఇప్పుడు ఉద్యోగం చేసున్నాను. కాస్త ఆర్థికంగా నిలబడ్డాక ఫిల్మ్‌ ఇండ్రస్టీకు వెళతాను. ‘అనుసంధానం’కు ఉహించిన దానికంటే ఎక్కువ ఆదరణ వచ్చింది. ప్రముఖ కథ, మాటల రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ ఫోన్‌ చేయడం ఆనందంగా ఉంది.
– ఆనంద్, షార్ట్‌ఫిల్మ్‌ దర్శకుడు, రచయిత  

మరిన్ని వార్తలు