మహిళల పట్ల ఎస్‌ఐ అనుచిత వ్యాఖ్యలు

13 Feb, 2014 23:43 IST|Sakshi

 వెల్దుర్తి, న్యూస్‌లైన్ : చెరువులో చేపలు పట్టే విషయంలో ఓ వర్గం మహిళలపై స్థానిక ఎస్‌ఐ అశోక్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా గురువారం మండల పరిధిలోని ఎలుకపల్లికి చెందిన ముది రాజ్ కులస్తులు స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భం గా ఎస్‌ఐ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. అయితే ఈ విషయం లో విచారణ చేయిస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

 వివరాల్లోకి వెళితే..
వెల్దుర్తి పంచాయతీ ఎలుకపల్లి శివారు అటవీ ప్రాంతంలో ఉన్న కాన్‌చెరువు (చేపల కోసం) హక్కులపై ఎలుకపల్లికి చెందిన ముదిరాజు లు, వెల్దుర్తికి చెందిన గంగపుత్రుల మధ్య ఆరు నెలలుగా వివాదం నడుస్తోంది. అయితే వారం రోజుల క్రితం చెరువులో చేపల వేట కొనసాగిస్తున్నారని గంగపుత్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముదిరాజ్‌లను ఎస్‌ఐ స్టేషన్‌కు తీసుకువచ్చారు. బుధవారం స్థానిక ఎస్‌ఐ పో లీసుల ఆధ్వర్యంలో బందోబస్తు మధ్య చెరువులో ఉన్న చేపలను గంగపుత్రులు వేటాడారు. అయితే మిగిలిన ముదిరాజ్ లు, మహిళలు  దీనిని అడ్డుకోడానికి ప్రయత్నించారు.

 ఇందుకు ఆగ్రహించిన ఎస్‌ఐ సదరు కులస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హెచ్చరికలు జారీ చేశా రు. అనంతరం ముదిరాజ్ కులస్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంత రం సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని వెనుతిరిగారు. గురువారం ముదిరాజ్‌లను రిమాండ్‌కు తరలిస్తుండగా సదరు కులస్తులతో పాటు వెల్దుర్తి సర్పంచ్ మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడు తోట నరసింహులు, ఉపసర్పంచ్ వెంకటేష్‌లు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సర్పంచ్ మో హన్‌రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ నేతల అండతో నిరుపేదలైన ముదిరాజులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆరోపించారు.

దీంతో ఆగ్రహా నికి గురైన ఎస్‌ఐ సర్పంచ్‌ని తీవ్రంగా దూర్భాషలాడారు. దీంతో బాధితులు పోలీస్‌స్టేషన్ నుంచి ర్యాలీగా వచ్చి వె ల్దుర్తి పట్టణాన్ని బంద్ చేయించి బ స్టాండ్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎస్‌ఐ దిష్టిబొమ్మతో అంబేద్కర్ చౌరస్తా వరకు శవయాత్ర నిర్విహ ంచి అక్కడ దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. అయితే విష యం తెలుసుకున్న తూప్రాన్ సీఐ సం జయ్‌కుమార్ అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ ఎస్‌ఐ మహిళలపై అనుచిత వాఖ్యలు చేశారని, బాంబులు వేసి ఇళ్లను ధ్వం సం చేస్తానని హెచ్చరించారని ఆరోపిం చారు.

మంత్రి సునీతారెడ్డికి బంధువునంటూ అమాయక ప్రజలను వేధిస్తున్నాడని, తక్షణమే ఎస్‌ఐపై చర్యలు తీ సుకోవాలని డిమాండ్ చేశారు. తాను ఎస్‌ఐపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆం దోళన కారులు శాంతించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి అక్కడ ధర్నా నిర్వహించి తహశీల్దార్‌కు మెమోరాండం సమర్పించారు.

 హక్కులు ముదిరాజులకే : సర్పంచ్
 పంచాయతీ పరిధిలో 20 చెరువులు, కుంటలు ఉండగా పంచాయతీ అభివృ ద్ధి కోసం వేలం పాటలు చేశామని సర్పంచ్ మోహన్‌రెడ్డి తెలిపారు. 18 చెరువు, కుంటలకు గంగపుత్రులకు కే టాయించి.. కాన్ చెరువు ముదిరాజుల కు, నర్సిన్ చెరువు ఎస్సీలకు కేటాయించామన్నారు. ఎస్‌ఐ అతిగా ప్రవర్తిస్తూ పోలీసు బలగాలతో కాన్‌చెరువులో అక్రమంగా గంగపుత్రులచే దగ్గరుండి చేపలు పట్టించడమే కాకుండా అక్రమ కేసులు బనాయించి రిమాండ్‌కు తరలించారని ఆరోపించారు.

 తండ్రి రిమాండ్‌తో సొమ్మసిల్లిన కుమార్తె
 చేపల వేటకు వెళ్లిన ముదిరాజలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే గుడ్డివాడైన కానికే అంజయ్యను రిమాండ్‌కు తరలించడంతో ఆయన కుమార్తె మంజుల సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో ఆమెను తోటి మహిళలు ఆస్పత్రికి తరలించారు.

 డీపీఓ ఆదేశాల మేరకే బందోబస్తు ఇచ్చాం
 కాన్‌చెరువు హక్కులు గంగపుత్రులకే ఉంటాయని డీపీఓ ఆదేశాల మేరకే గంగపుత్రులు కాన్‌చెరువులో చేపలు పట్టడానికి బందోబస్తు ఇచ్చామని తూప్రాన్ సీఐ సంజయ్‌కుమార్, స్థానిక ఎస్‌ఐ అశోక్‌రెడ్డిలు తెలిపారు. కాన్‌చెరువుపై గంగపుత్రులకు పూర్తి హక్కు ఉంటుందని సర్పంచ్‌కు డీపీఓ నోటీసులు కూడా పంపారన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 7న కాన్‌చెరువులో ముదిరాజులు చేపల వేట సాగిస్తున్నారని గంగపుత్రులు తమకు ఫిర్యాదు చేయగా అక్రమంగా చేపలు పడుతున్న ముదిరాజులైన మల్లయ్య, అంజయ్య, స్వామి, భాగయ్య, పోచయ్య, అంజయ్య, మైసయ్య, యాదగిరి, కిష్టయ్యలపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

మరిన్ని వార్తలు