చరిత్ర సృష్టించిన సింహాద్రి

24 May, 2019 16:39 IST|Sakshi
పోలింగ్‌ కేంద్రం వద్ద విక్టరీ సంకేతాన్ని చూపుతున్న సింహాద్రి

సాక్షి, అవనిగడ్డ: అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ చరిత్ర సృష్టించింది. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎమ్మెల్యే అయిన సింహాద్రి రమేష్‌బాబు రికార్డు మెజారిటీ సా«ధించారు. మొత్తం 19 రౌండ్లకుగానూ 17 రౌండ్లలో వైఎస్సార్‌సీపీ అత్యధిక మెజారిటీ సాధించగా, టీడీపీ రెండు రౌండ్లలో స్వల్ప ఆధిక్యత మాత్రమే కనబరచింది. దివిసీమలో తొలిసారి వైఎస్సార్‌సీపీ విజయ బావుటా ఎగురవేయడంతో నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
 

రికార్డు మెజారిటీ... 
అవనిగడ్డ నియోజకవర్గంలో మొత్తం 2,07,240 మంది ఓటర్లు ఉండగా, గత నెల 11న జరిగిన ఎన్నికల్లో 1,82,603 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున సింహాద్రి రమేష్‌బాబు, టీడీపీ తరఫున మండలి బుద్ధప్రసాద్, జనసేన తరఫున ముత్తంశెట్టి కృష్ణారావు పోటీచేయగా త్రిముఖ పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్‌బాబు రికార్డు స్థాయిలో 20,725 మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించారు. అవనిగడ్డ నియోజకవర్గ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీగా నమోదైంది. 1962లో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత టీడీపీ ఆవిర్భావం అనంతరం 1983లో జరిగిన తొలి ఎన్నికల మెజారిటీ 10,668 ఇప్పటి వరకూ అత్యధిక మెజారిటీగా నమోదైంది.

అంతకంటే రెట్టింపు మెజారిటీ సాధించిన సింహాద్రి దివిసీమ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని నమోదు చేశారు. ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మరణంతో 2013లో జరిగిన ఎన్నికల్లో ఆయన తనయుడు అంబటి శ్రీహరి ప్రసాద్‌ పోటీచేయగా, ఇంటిపెండెంట్‌ అభ్యర్థిపై 61,644 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఉప ఎన్నిక కావడం, ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్‌ పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో సింహాద్రికి పోస్టల్‌ బ్యాలెట్స్‌తో కలుపుకుని 78,434 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి మండలి బుద్ధప్రసాద్‌కు 57,701 ఓట్లు వచ్చాయి. 20,725 ఓట్ల బంపర్‌ మెజారిటీతో సింహాద్రి విజయ దుందుభి మ్రోగించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌

అఖిలేశ్‌ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!

యూపీలో కూటమికి బీటలు..?

జగన్‌ పాలనను.. చూస్తున్నారా చంద్రబాబూ?

సంఖ్యే ముఖ్యం... శాతం కాదు

గాంధీజీపై ఐఏఎస్‌ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య

బదులు తీర్చుకున్న నితీశ్‌

నితీశ్‌ కేబినెట్‌లోకి కొత్త మంత్రులు.. బీజేపీకి కౌంటర్‌!

మళ్లీ అదే జోడీ

‘త్రిభాష’పై తమిళ పార్టీల కన్నెర్ర

రక్షణ బాధ్యతల్లో రాజ్‌నాథ్‌