డిసెంబర్ 21నుంచి జాతీయస్థాయి నాటిక పోటీలు

12 Nov, 2014 08:47 IST|Sakshi

ఫిరంగిపురం : ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగం అభివృద్ధి సంస్థ (హైదరాబాద్) సౌజన్యంతో డిక్మన్ కళాపరిషత్  ఆధ్వర్యంలో స్థానిక సెయింట్ పాల్స్ పాఠశాలలోని కళావేదికపై డిసెంబర్ 21 నుంచి 23 వరకు జాతీయస్థాయి నాటిక పోటీలు నిర్వహించనున్నట్లు కళాపరిషత్ అధ్యక్షుడు పోలిశెట్టి రాజారావు మంగళవారం తెలిపారు. పోటీలో పాల్గొనే నాటికల వివరాలను వెల్లడించారు.
 
21వ తేదీ మూడు నాటికలు ప్రదర్శిస్తారు. అవి..  హైదరాబాద్ మురళీ కళానిలయం ఆధ్వర్యంలో ‘వార్నీ అదా విషయం’ నాటిక. రచన శంకరంమంచి పార్ధసారథి, దర్శకత్వం తల్లావజ్జుల సుందరం. ఒంగోలు జనచైతన్య ఆధ్వర్యంలో ‘పుత్రికాచితి’ నాటిక. రచన ఏవీ మల్వేశ్వరరావు, దర్శకత్వం ఎల్.శంకర్. చెన్నూరు శాలివాహన కళామందిర్ ఆధ్వర్యంలో ‘చిగురించని వసంతం’, రచన వలమేటి, దర్శకత్వం కె.ఎల్.నారాయణరావు.
 
22వ తేదీ నాలుగు నాటికలు ప్రదర్శిస్తారు. అవి.. కరీంనగర్ చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ‘దొంగలు’ నాటిక. రచన పి.శివరామ్, దర్శకత్వం ఎం.రమేష్. నెల్లూరు క్రాంతి ఆర్ట్స్ థియేటర్స్ వారి ‘అస్తమిస్తున్న సూర్యుడు’ నాటిక. రచన పనసాల, దర్శకత్వం టి.సురేష్‌బాబు. తెనాలి డి.ఎల్.కాంతారావు ఎంప్లాయీస్ మెమోరియల్ వారి ‘సముద్రమంత సంతోషం’ నాటిక. రచన సిగ్ద, దర్శకత్వం పి.ఎస్.ఆర్.బ్రహ్మాచార్యులు. కొలకలూరి కళాలయ వారి ‘మాకంటూ ఒకరోజు’నాటిక. రచన, దర్శకత్వం ఎస్.కె.హుస్సేన్.
 
23వ తేదీ రెండు నాటికలు ప్రదర్శిస్తారు. అవి.. వైజాగ్ గోవాడ సుగర్స్ లిఖితసాయి క్రియేషన్స్ ఆధ్వర్యంలో ‘మాకంటూ ఒక రోజు’ నాటిక. రచన, దర్శకత్వం దండు నాగేశ్వరరావు, జయంతి సుబ్రహ్మణ్యంసతీష్. గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ‘అమ్మకో ముద్దు’ నాటిక. రచన, దర్శకత్వం జీడిగుంట రామారావు, ఎన్.రవీంద్రరెడ్డి. అనంతరం పోటీల్లో ఉత్తమ ప్రదర్శనకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది.
 

మరిన్ని వార్తలు