‘ఓటర్లుగా నమోదు కండి’

17 Nov, 2016 01:27 IST|Sakshi

నేటి నుంచి ప్రక్రియ ప్రారంభం
 
 సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఉభయ రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలవారీగా ఓటర్ల ముసారుుదా జాబితాలను బుధవారం ప్రకటించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

ఆ జాబితాల్లో పేర్లు లేనివారితో పాటు వచ్చేఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారు గురువారం నుంచి ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చేనెల 14వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువుందని ఆయన తెలిపారు.ఓటర్లుగా నమోదుకు దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చునన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఈఓఆంధ్రా.ఎన్‌ఐసీ.ఇన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.

మరిన్ని వార్తలు