ఎల్లమ్మ.. బంగారం

17 Jul, 2020 13:24 IST|Sakshi

భర్త మృతిచెందాడు 

సంతానం అండలేదు ఎవరిపై ఆధారపడలేదు

రోళ్లు తయారు చేస్తూ 20 ఏళ్లుగా వృద్ధురాలి జీవనం

నెల్లూరు(మినీబైపాస్‌): ఆమె వయసు 65 సంవత్సరాలు.. భర్త మృతిచెందాడు. సంతానం పట్టించుకోలేదు. ఎవరైనా సాయం చేస్తారా అని ఎదురు చూడలేదు. తన కాళ్లపై తాను నిలబడింది. రోళ్లు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతోంది.

ఎల్లమ్మ సొంత ఊరు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం.
భర్త చనిపోవడం.. సంతానం అండగా లేకపోవడంతో 20 సంవత్సరాల క్రితం ఆమె నెల్లూరుకు వలస వచ్చింది. తన కాళ్లపై తాను నిలబడాలని నిర్ణయించుకుంది.
నగరంలోని ప్రభుత్వాస్పత్రి సమీపంలో చిన్న గుడిసె వేసుకుని ఉంటోంది. వర్షం కురిస్తే అక్కడ తంటాలు పడుతూ ఉండాలి.
రోళ్లు తయారుచేసి జీవనం పొందుతోంది.
అనంతపురం నుంచి రాళ్లను తెప్పించుకుంటుంది.
రోజుకు మూడు రోళ్లు తయారు చేస్తుంది.
ఒక్కోటి సైజ్‌ని బట్టి రూ.150 నుంచి రూ.200కు విక్రయిస్తుంది. వచ్చిన డబ్బుతో జీవితాన్ని నెట్టుకొస్తోంది.

కొంత తగ్గింది
అండగా నిలవాల్సిన సంతానం ఎక్కడున్నారో తెలియదు. నాకు తెలిసింది ఇదే పని. 20 సంవత్సరాలుగా చేస్తున్నా. మిక్సీలు, గ్రైండర్లు రావడంతో రోళ్ల వినియోగం కొంత తగ్గింది. అయినా నా కాళ్లపై నేను నిలబడుతున్నా. సంపాదన తక్కువే అయినా ఎవరిపైనా ఆధారపడకుండా జీవిస్తున్నా.   – ఎల్లమ్మ

మరిన్ని వార్తలు