మళ్లీ ఆ ముగ్గురి విచారణ

12 Nov, 2018 07:06 IST|Sakshi
ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌కు మహిళను తీసుకువెళుతున్న కానిస్టేబుల్‌

వీరిలో నిందితుడు శ్రీనివాస్‌ సోదరి..

మరో ఇద్దరు మహిళలు సాక్ష్యం కోసమంటున్న పోలీసులు

మరిన్ని వివరాలు రాబట్టినట్టు సమాచారం

సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు అనుమానితులను మరోసారి రహస్య విచారణ చేపట్టారు. నిం దితుడు జనుపల్లి శ్రీనివాసరావు వరసకు సోదరి అయిన విజయదుర్గతో లేఖ రాయించినట్టు, హత్యాయత్నానికి ముందు రోజు తాను ‘సంచలనం చేయబోతున్నాను.. టీవీల్లో కనిపిస్తాను..’ అంటూ ప్రకాశం జిల్లా కనిగిరి మండలం దేవాంగనగర్‌కు చెందిన షేక్‌ అమ్మాజీ, సయ్యద్‌బీలతో ఫోన్‌లో మాట్లాడినట్టు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ఘటన జరిగిన రెండ్రోజుల అనంతరం వారిని సిట్‌ పోలీసులు విశాఖ తీసుకొచ్చి విచారించారు. అనంతరం వారిని వారి స్వగ్రామాలకు పంపేశారు. తాజాగా సిట్‌ పోలీసులు ఈ ముగ్గురిని మరోసారి శనివారం విశాఖ తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఒక్క శ్రీనివాసరావు నే పోలీసులు నిందితుడిగా పేర్కొంటున్నారు. ఆయన వెనక ఎవరున్నారన్న దానిపై పోలీసులు పెదవి విప్పడం లేదు.

ఈ నేపథ్యంలో ఈ మహిళల నుంచి మరింత అదనపు సమాచారం రాబట్టడంకోసం మరోసారి వీరిని రప్పించినట్టు తెలు స్తోంది. వీరిలో ఒక మహిళను శనివారం ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌లోను, మిగిలిన ఇద్దరినీ మరో చోట రహస్యంగా విచారించినట్టు సమాచారం. మున్ముందు కోర్టుకు సమర్పించే నివేదికలో సా క్ష్యాల కోసం వీరిని రప్పించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకా రం వీరి నుంచి శ్రీనివాసరావుకు సంబంధించిన మరికొంత సమాచారాన్ని సేకరించినట్టు తెలి సింది. వీరిచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగించే పనిలో సిట్‌ పోలీసులు ఉన్నారు. అయితే ఈ ముగ్గురు మహిళల విచారణపై పోలీసు అధికారులు పెదవి విప్పడం లేదు.

బోసిపోయిన ఎయిర్‌పోర్టుపోలీస్‌స్టేషన్‌..
గత 17 రోజులుగా నిత్యం మీడియా ప్రతినిధులు, వాహనాలు, అనుమానితులు బంధువులతో రద్దీగా కనిపించే ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌ ఆదివారం బోసిపోయింది. స్టేషన్‌లో కొద్దిమంది దిగువస్థాయి సిబ్బంది మినహా అధికారులెవ్వరూ లేరు.  వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనపై జరిగిన హత్యాయత్నం అనంతరం విశాఖ విమానాశ్రయానికి వస్తున్నందున ఈ స్టేషన్లో విధులు నిర్వహించే అధికారులంతా అక్కడ బందోబస్తుకు వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు