రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చెంత?

30 Aug, 2014 09:23 IST|Sakshi
రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చెంత?

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని జోన్ నిర్మాణానికి భారీగానే సొమ్ము అవసరం అవుతుందని శివరామకృష్ణన్ కమిటీ తెలిపింది. అందులో వేటివేటికి ఎంతెంత కావాలో కమిటీ చెప్పింది. తాగునీరు, మౌలిక వసతులు, డ్రైనేజీల నిర్మాణానికి రూ. 1536 కోట్లు కావాలని తెలిపింది. రాజ్‌భవన్‌ కోసం 56 కోట్లు, సచివాలయం కోసం 68 కోట్లు, 8 రైల్వే జోన్ల నిర్మాణానికి 7,035 కోట్లు, అతిధి గృహాల నిర్మాణానికి 559 కోట్లు, డైరెక్టరేట్ల నిర్మాణానికి 6,658 కోట్లు అవసరమని సూచించింది. రాజధాని, ఇతర భవనాల ఏర్పాటుకు 27,092 కోట్లు అవసరమని పేర్కొంది. విమానాశ్రయాల అభివృద్ధికి 10,200 కోట్లు, హైకోర్టు సహా న్యాయవ్యవస్థకు సంబంధించిన నిర్మాణాలకు 1271 కోట్లు అవసరమని నివేదికలో పేర్కొంది. భూసేకరణ ఆలస్యమయ్యే కొద్ది రాజధాని నిర్మాణం ఆలస్యమౌతుందని కమిటీ పేర్కొంది.

ఆర్థికలోటుతో అల్లాడుతున్న ఏపీకి ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం సముచితమని కమిటీ అభిప్రాయపడింది. త్వరలోనే ఎన్డీసీను సంప్రదించి స్వతంత్ర ప్రతిపత్తి హోదాను కల్పించాలని సూచించింది. అయితే తమవి కేవలం అభిప్రాయాలు, సూచనలేనని...రాజధాని ఎంపిక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.

>
మరిన్ని వార్తలు