శివరామకృష్ణన్ కమిటీ ‘దొనకొండ’ సందర్శన

11 Aug, 2014 07:28 IST|Sakshi
శివరామకృష్ణన్ కమిటీ ‘దొనకొండ’ సందర్శన

దొనకొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటు పరిశీలనలో భాగంగా ఆదివారం సాయంత్రం శివరామకృష్ణన్ కమిటీ దొనకొండను సందర్శించింది. స్థానిక సర్పంచ్ ఆలంపల్లి అనంతలక్ష్మి కమిటీ సభ్యులకు స్వాగతం పలికారు. కమిటీ సభ్యులు కేటీ రవీంద్ర, రెవీ, పి.తిమ్మారెడ్డి ముందుగా విమానా శ్రయం  భూములను పరిశీలించారు. భూముల వివరాలను రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

 అనంతరం ఇండ్లచెరువు పంచాయతీ పరిధిలోని పోచమక్కపల్లెలో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. అక్కడి నుంచి వచ్చి రైల్వే స్టేషన్‌ను పరిశీలించి, స్థానిక నాయకులు షేక్ నవాబ్, షేక్ మగ్బూల్‌అహ్మద్, మల్లికార్జునశర్మతో చర్చించారు. దొనకొండలోని పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి త్వరలో నివేదిక రూపంలో అందిస్తామని తెలిపారు. మండలంలో సుమారు 54 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు రెవెన్యూ అధికారుల ద్వారా తెలుసుకున్నారు.

 వీరివెంట జిల్లా జాయింట్ యాకూబ్‌నాయక్, జిల్లా సర్వేయర్ నర్శింహరావు, కందుకూరు, మార్కాపురం ఆర్డీవోలు బాపిరెడ్డి, కొండయ్య, తహశీల్దార్ కేవీ సత్యనారాయణ, రాజధాని సాధన సమితి అధ్యక్షుడు ఉడుముల లక్ష్మీనారాయణరెడ్డి, దర్శి  డీఎస్పీ బి.లక్ష్మీనారాయణ, వైఎస్సార్‌సీపీ కన్వీనర్ కందుల నారపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు