ఏడాదికి ఆరు సిలెండర్లు చాలు:పనబాక

15 Jan, 2014 17:23 IST|Sakshi
ఏడాదికి ఆరు సిలెండర్లు చాలు:పనబాక

బాపట్ల(గుంటూరు): కేంద్రమంత్రి పనబాక లక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ఏడాదికి రాయితీ సిలెండర్లను ఆరు నుంచి తొమ్మిది పెంచిన సంగతి తెలిసిందే.  ఆ తొమ్మిది నుంచి మరో మూడు సిలెండర్లు పెంచాలని కూడా కేంద్రం యత్నాలు చేస్తున్న నేపథ్యంలో పనబాక మాత్రం విడ్డూరంగా మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత నియోజక వర్గం బాపట్ల కు విచ్చేసిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
 

కుటుంబానికి ఆరు సిలెండర్లు కేంద్రం అందిస్తే చాలని  పేర్కొన్నారు. ఆ విషయాన్ని సర్వే నే తెలిపిందంటూ వ్యాఖ్యానించారు. ఎక్కువగా సిలెండర్లు ఇస్తే దారిద్ర్యానికి దిగువన ఉన్న(బీపీఎల్)కుటుంబాలు అమ్మేసుకుంటున్నాయంటూ నోరు పారేసుకున్నారు. ఆమె వ్యాఖ్యలపై నిరసన గళం పెళ్లుబికింది. తొమ్మిది సిలెండర్లతో ఎలా నెట్టుకు రావాలని సామాన్య ప్రజలు తర్జన భర్జన పడుతుంటే..ఆమె ఇలా మాట్లాడటం మంచిది కాదని ఆందోళన కారులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు