-

ఆరుగురు తెలంగాణ మంత్రులు సీఎంతో భేటీకి డుమ్మా

12 Sep, 2013 02:04 IST|Sakshi
ఆరుగురు తెలంగాణ మంత్రులు సీఎంతో భేటీకి డుమ్మా

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో  పద్నాల్గవ ఆర్థిక సంఘం పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మంత్రుల సమావేశానికి  తెలంగాణకు చెందిన ఆరుగురు మంత్రులు గైర్హాజరయ్యూరు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ప్రసాద్ కుమార్, దానం నాగేందర్, రామిరెడ్డి వెంకటరెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేదు. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం ముఖ్యమంత్రి  అనేక సార్లు సమైక్య వాదం వినిపించడంవల్లనే రాజనర్సింహ, జానారెడ్డి గైర్హాజరయ్యూరని భావిస్తున్నారు.
 
  సవూవేశానికి18మంది సీవూంధ్ర మంత్రులు రాగా, వారిలో టీజీ వెంకటేశ్, గల్లా అరుణకుమారి, గంటా శ్రీనివాసరావు, శత్రుచర్ల విజయరామరాజు హాజరు కాలేదు. సుమారు 20 నిమిషాల ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,.. చాలా రోజులైనందున ఒకసారి అందరినీ కలిసి నమస్కారం పెడదామని పిలిచానని అన్నట్టు సమాచారం. 14వ ఆర్థిక సంఘం గురు, శుక్రవారాల్లో రాష్ర్ట ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఆర్థిక సంఘం సిఫార్సులు రాష్ట్రానికి అత్యంత కీలకమని, ఆర్థిక సంఘం ముందు అందరం కలిసి సమర్థవంతమైన వాదనలు వినిపించాలని, ఇందుకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. సమర్థవంతంగా వాదనలతో రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులను రాబట్టుకుందావున్నారు.
 
 20న కేబినెట్ భేటీ
కాగా, ఈ నెల 20న వుంత్రివర్గ సవూవేశం ఏర్పాటు చేసుకుని, అదే రోజు అన్ని విషయూలు చర్చించుకుందావుని వుుఖ్యవుంత్రి ఈ సందర్భంగా వుంత్రులతో చెప్పినట్టు తెలిసింది. ఈ సమావేశం తరువాత సీఎం, మంత్రులు కలిసి క్యాంపు కార్యాలయం ఎదుట హోటల్ లో, ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డికి, సంఘం సభ్యులకు, కేంద్ర అధికారులకు విందు ఇచ్చారు.

మరిన్ని వార్తలు