స్కేటింగ్ చిచ్చరపిడుగు

27 Mar, 2015 01:35 IST|Sakshi
స్కేటింగ్ చిచ్చరపిడుగు

40 సుమోల కింద దూసుకెళ్లిన క్రీడాకారుడు
 
తిరుపతి: తిరుపతికి చెందిన దేవీప్రసాద్ (8) స్కేటింగ్‌లో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. మూడో తరగతి చదువుతున్న ఇతను తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయం సమీపంలో గురువారం 40 సుమో వాహనాల  కింద 7 అంగుళాల ఎత్తులో తన రెండు కాళ్లును బ్యాలెన్స్ చేసుకుంటూ శరీరాన్ని నేలకు తగలకుండా సమాంతరంగా 15 సెకన్లలో 110 మీటర్లు దూసుకెళ్లే ఫీట్‌ను చేసి చూపించాడు.

  వెనుక నుంచి అదే దూరాన్ని 21.24 సెకన్లలో చేరుకుని ఔరా అనిపించాడు. ఈ స్కేటింగ్ వీడియోలను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం పంపిస్తున్నామని దేవీప్రసాద్ తండ్రి లోకనాథం తెలిపారు.
 

మరిన్ని వార్తలు