ఓర్వలేక అక్కసుతో తప్పుడు ప్రచారం

26 Sep, 2019 04:59 IST|Sakshi
ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆంధ్రజ్యోతిపై ఫిర్యాదు చేస్తున్న విద్యార్థులు

ఓ పత్రిక కథనంపై ఎస్కేయూ అధికారుల మండిపాటు 

తాము గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ప్రశ్నాపత్రాలు రూపొందించలేదని వెల్లడి 

సాక్షి, అమరావతి: గ్రామ,వార్డు సచివాలయ పరీక్షల్లో హార్టీకల్చర్, సెరికల్చర్‌కు సంబంధించిన ప్రశ్నపత్రాలను అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో(ఎస్కేయూ) రూపొందించారని, అక్కడి నుంచే లీక్‌ చేశారంటూ ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని వర్సిటీ అధికారులు తీవ్రంగా ఖండించారు. సదరు పత్రికపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తమ యూనివర్సిటీలో హార్టీకల్చర్‌ విభాగమే లేదని, అలాంటప్పుడు ప్రశ్నాపత్రం ఎలా రూపొందిస్తామని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రం తయారు చేయాలంటూ ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సెరికల్చర్‌ ప్రొఫెసర్‌ శంకర్‌ నాయక్‌ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం లక్షల మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తుండడంతో ఓర్వలేక అక్కసుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఆ పత్రిక కథనంలో ఏమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు. పత్రికపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తమ వర్సిటీ రిజిస్ట్రార్‌కు వినతి పత్రం ఇచ్చానని అన్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌కు కూడా మెయిల్‌ పంపించానని తెలిపారు. తప్పుడు వార్తలు రాసి తమ విశ్వవిద్యాలయ ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నారని శంకర్‌ నాయక్‌ మండిపడ్డారు. వార్తల కోసం యూనివర్సిటీని, ప్రొఫెసర్లను వాడుకోవడం దారుణమని అన్నారు. గతంలో యూనివర్సిటీలో ఎన్నో సమస్యలపై విద్యార్థులతో కలిసి పోరాటం చేశానని గుర్తుచేశారు.

తాను గిరిజన తెగకు(ఎస్టీ) చెందినవాడిని కాబట్టి, తనకు చెడ్డపేరు తీసుకురావడానికి కొందరు వ్యక్తులు తనపై అసత్య ప్రచారం చేస్తున్నట్లు అనుమానంగా ఉందని వెల్లడించారు. ప్రొఫెసర్‌ శంకర్‌నాయక్‌ ఇచ్చిన వినతిపత్రం విషయంలో పై అధికారులతో చర్చించి, తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్కేయూ రిజిస్ట్రార్‌ మల్లికార్జున్‌రెడ్డి చెప్పారు. పత్రికల్లో తప్పుడు వార్తలు రాయడం తమ వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించే విషయమేనని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ప్రశ్నాపత్రాలు రూపొందించాలంటూ తమకు ఎవరూ సంప్రదించలేదని పేర్కొన్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం

దోపిడీ గుట్టు.. 'గూగుల్‌ ఎర్త్‌' పట్టు 

అది ముమ్మాటికీ అక్రమ కట్టడమే : ఆర్కే

ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల పథకం ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’

5న దుర్గమ్మకు సీఎం పట్టువస్త్రాల సమర్పణ

నేడు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

850 బిలియన్‌ డాలర్లకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ

రబీకి రెడీ

‘పోలవరం’లో రూ.782 కోట్లు ఆదా

ప్రభుత్వ పథకాల డబ్బు లబ్ధిదారులకే

ఈనాటి ముఖ్యాంశాలు

టీడీపీకి రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా?

రేపు విశాఖ-విజయవాడ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు

‘అందుకే సీఎం జగన్‌ను అభినందిస్తున్నా’

కర్నూలులో భారీ వర్షం

బయటపడ్డ ఎల్లో మీడియా బాగోతం

అక్టోబర్ 10న వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం

రిమ్స్‌ నియంత్రణలోకి ఆసుపత్రి, కిడ్నీ పరిశోధనా కేంద్రం

‘సివిల్‌ కోర్టు అధికారాలు ఈ కమిషన్‌కు ఉంటాయి’

‘చంద్రబాబు అక్కడ ఎందుకు ఉంటున్నాడో అర్థం కావట్లే’

ఇద్దరు ఎస్‌ఐలపై సస్పెన్షన్‌ వేటు

వైఎస్సార్‌ను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు

28న సాహిత్యకారులకు పురస్కారాలు

వెనుక ఆయన ఉన్నారనే లింగమనేని ధీమా

ఏపీకి అయిదు నేషనల్ వాటర్ మిషన్ అవార్డులు 

కేంద్ర మంత్రిని కలిసిన మేకపాటి​ గౌతమ్‌రెడ్డి

అక్రమాల ‘ప్రిన్స్‌’పాల్‌పై వేటు

రమ్యశ్రీ కడసారి చూపు కోసం..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హౌడీ మోడీలో.. పక్కా లోకల్చల్‌

అధీర అడుగుపెట్టాడు

డబుల్‌ యాక్షన్‌

ప్రముఖ నటుడు వేణుమాధవ్‌ కన్నుమూత

పెళ్లనేది కెరీర్‌కి అడ్డంకి కాదు

అథ్లెటిక్‌ నేపథ్యంలో...