ఎస్కేయూ విద్యార్థులకు అస్వస్థత

20 Aug, 2018 12:45 IST|Sakshi
చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు

కలుషిత భోజనంతో 20 మంది ఆస్పత్రిపాలు

ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయరాయ విశ్వవిద్యాలయంలో ఆదివారం కలకలం రేగింది. క్యాంపస్‌లోని మందాకిని, పినాకిని హాస్టళ్లలో మధ్యాహ్నం పలావ్‌ అన్నం తిన్నారు. కెమిస్ట్రీ, ఫార్మసీ, ఎలక్ట్రానిక్స్‌ విద్యార్థుల్లో 20 మంది సాయంత్రానికల్లా అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన తలనొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న వారిని వర్సిటీ అంబులెన్స్‌ ద్వారా అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. వీరిలో 15 మంది ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, మిగిలిన ఐదుగురికి వైద్య చికిత్సలు అందిస్తున్నామని డాక్టర్లు పేర్కొన్నారు. బాధిత విద్యార్థులను హాస్టల్‌ వార్డెన్‌ ప్రొఫెసర్‌ జ్యోతివిజయ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు కాంత్రికిరణ్, అంకె శ్రీనివాస్, హేమంత్‌కుమార్, ఆవుల రాఘవేంద్రరెడ్డి, వెంకీయాదవ్‌ తదితరులు పరామర్శించారు. 

మరిన్ని వార్తలు