కాన్వెంట్‌లో ఊడిపడ్డ శ్లాబ్

25 Aug, 2013 09:28 IST|Sakshi
కాన్వెంట్‌లో ఊడిపడ్డ శ్లాబ్

ముక్తేశ్వరం కోనసీమ విద్యాశ్రమ్ కాన్వెంట్‌కు చెందిన భవనంలో శ్లాబ్ శనివారం ఊడిపడింది. ఈ ప్రమాదంలో పరీక్ష రాస్తున్న విద్యార్థికి, ఓ ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలవ్వగా, కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆ గదిలో సుమారు 20 మంది విద్యార్థులున్నారు. ఎంఈఓ బీర హనుమంతరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
 
 గాయాల పాలైన ఉపాధ్యాయుడు ఎస్పీఎస్‌ఎస్ మూర్తి, విద్యార్థి బిళ్ల నర్సింహలను పరామర్శించారు. పురాతన భవనంలో స్కూలు నిర్వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాసంస్థ నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురాతన భవనంలో స్కూలు నిర్వహణకు ఎలా అనుమతించారంటూ విద్యాశాఖ అధికారులను నిలదీశారు.
 
 దీనిపై ఎంఈఓ బీర హనుమంతరావును వివరణ కోరగా, స్కూలు నిర్వహిస్తున్నది పురాతన భవనం కావడం వల్ల శ్లాబు పెచ్చులుగా ఊడి పడిందన్నారు. ఈ క్రమంలో అక్కడున్న విద్యార్థులకు , ఉపాధ్యాయులకు గాయాలయ్యాయన్నారు. స్కూలు  భవనం అనుమతులను పరిశీలిస్తున్నామన్నారు. ఈ భవనంలో స్కూలు నిర్వహణను నిలిపి వేస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు