స్మార్ట్ ఏపీ పథకానికి జనవరి 1న శ్రీకారం

13 Dec, 2014 20:45 IST|Sakshi

హైదరాబాద్: స్మార్ట్ ఏపీ పథకానికి జనవరి 1న శ్రీకారం చుట్టనున్నారు. దత్తత తీసుకునేవారికి అదే రోజున గ్రామాలను కేటాయిస్తారు. జనవరి 5న పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ నెలాఖరులోగా ఈ పథకానికి కావలసిన ఏర్పాట్లు పూర్తి చేయమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, మునిసిపాలిటీలను స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్తో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇటీవల వీడియో కాన్ఫరెన్స్లో  చంద్రబాబు తెలిపారు.

రాష్ట్రంలోని 16వేల 250 గ్రామాలు, వార్డులను దత్తత ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, ఎన్జీఓలు, ఎన్ఆర్ఐలు, ప్రభుత్వ అధికారులు దత్తత తీసుకోవాలని చెప్పారు. ఐఏఎస్లు, జిల్లా అధికారులు తప్పించుకోవడానికి వీలులేదన్నారు. అందరూ తప్పనిసరిగా దత్తత తీసుకోవలసిందేనని చంద్రబాబు చెప్పారు.
**

మరిన్ని వార్తలు