వేలివెన్నులో 18న స్మార్ట్ విలేజ్ ప్రారంభం

16 Jan, 2015 18:23 IST|Sakshi
వేలివెన్నులో 18న స్మార్ట్ విలేజ్ ప్రారంభం

ఈ నెల 18 వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా వేలివెన్నులో ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. ఈ పథకానికి మరింత ప్రచారం కోసం 18 కిలోమీటర్లు పాదయాత్ర చేపడతారని తెలిపారు.

ఆయన యాత్రకు మద్దతుగా తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వారివారి నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పరకాల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చే దాతలకోసం ప్రత్యేక పోర్టల్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20 నుంచి 24 వరకు దావోస్ లో పర్యటిస్తారని ప్రకటించారు.

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు