హెచ్‌పీసీఎల్‌ నుంచి భారీగా పొగలు, కలకలం

21 May, 2020 17:01 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: హిందూస్టాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) రిఫైనరీ నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడంతో విశాఖపట్నంలో కలకలం రేగింది. హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో సీడీయూ-3ని తెరిచే క్రమంలో గాలిలోకి దట్టమైన పొగలు వెలువడ్డాయి. గోధుమ రంగు పొగలు దట్టంగా గాలిలోకి వ్యాపించడంతో విశాఖ నగర వాసులు ఆందోళనకు గురయ్యారు. అయితే కొంతసేపటికి పొగలు రావడం ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధి​కారులు స్పందించారు. దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. ఫ్లూయిడ్ క్యాటలిక్ క్రాకింగ్ సమయంలో దట్టమైన‌ పొగలు వస్తాయని తెలిపారు.

ఎల్‌జీ పాలీమర్స్‌ గ్యాస్‌లీక్‌ దుర్ఘటన నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంట్ను విశాఖ వాసులు హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ నుంచి భారీగా పొగలు రావడం చూసి భయాందోళనకు గురయ్యారు. అయితే గతంలోనూ ఇదేవిధంగా పొగలు వచ్చిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. కాగా, 2013, ఆగస్టు 23న హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో జరిగిన ఘోర ప్రమాదంలో 28 మంది కార్మికులు మృతి చెందగా, 18 మంది కాలిన గాయాలపాలయ్యారు. కూలింగ్ టవర్ పేలిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. (గ్యాస్‌లీక్‌ బాధితులకు పరిహారం సంపూర్ణం)

మరిన్ని వార్తలు