భీతిగొల్పుతున్న విష సర్పాలు

22 Jul, 2019 13:23 IST|Sakshi
జి.మాడుగుల పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న సత్యవతి

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరికి పాముకాట్లు

విశాఖపట్నం ,జి.మాడుగుల, కొయ్యూరు(పాడేరు): గిరిజన ప్రాంతంలో విష సర్పాలు భీతిగొల్పుతున్నాయి. ఇళ్లలోకి ప్రవేశిస్తుండడంతో పాటు రోడ్లపై  వాటి సంచారం ఎక్కువైంది.  దీంతో గిరిజనులు భయాం దోళన చెందుతున్నారు. జి,మాడుగుల  మండలంలో బొయితిలి పంచాయతీ పులుసుమామిడి గ్రామానికి చెందిన తెరడా సత్యవతి అనే మహిళ ఆదివారం çసమీపంలో గల అడవికి పశువులను మేతకు తీసుకువెళ్లగా పాముకాటుకు గురైంది.  కుటుంబ సభ్యులు ఆమెను జి.మాడుగుల పీహెచ్‌సీకు తరలించారు.  

యువకుడికి అస్వస్థత
పొలంలో పనిచేస్తుండగా  ఓ యువకుడిని పాము కాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. కొయ్యూరుకు చెందని ఎం.శివరామకృష్ణ శనివారం   పొలంలో పని చేస్తుండగా అతని చేతిపై పాము కాటు వేసింది.వెంటనే   రాజేంద్రపాలెం ఆస్పత్రికి తరలించారు. వైద్యాధికారి శ్యామల అతనికి యాంటి స్నేక్‌ వెనమ్‌(ఏఎస్‌వీ) ఇచ్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అతనిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఆయన నర్సీపట్నంలో  చికిత్స పొందుతున్నాడు.

మరిన్ని వార్తలు